తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2707 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 582 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,78,290కి చేరింది.
Also Read: స్నేహమంటే ఇదేరా... కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రాణ స్నేహితుల నివాళి...
5 కోట్ల మైలు రాసిన దాటిన తెలంగాణ
'కోవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్య సిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ లేదా బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏండ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేశారు.' అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: TRS : రైతుల కోసం జైలుకెళ్లడానికైనా కేసీఆర్ సిద్ధమే .. కేంద్రానికి భయపడేది లేదన్న టీఆర్ఎస్
సిబ్బందికి అభినందనలు
టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటడంతో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం వ్యాక్సినేషన్‌లో కృషి చేస్తున్న వైద్య సిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు. వైద్య సిబ్బంది కృషితో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసుకున్న తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీకాలు, కోవిడ్ జాగ్రత్తలు మాత్రమే కరోనా బారి నుంచి కాపాడతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని, మాస్కు విధిగా ధరించాలని, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Also read: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కామెంట్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చేయాలని కోరిన నెటిజన్