కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ లో వెతుకుతున్నారా? అయితే మీరు సమస్యల్లోకి వెళుతున్నట్టే. సైబర్ నేరగాళ్లు.. ఇందులో.. అందులో అనేం లేదు. ఎందులోనైనా దూరేస్తారు. మీరు నంబర్ కోసం.. వెతికినా... సరే.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కేస్తారు. నమ్మట్లేదా? సైబరాబాద్ పరిధిలో 1395 కేసుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉన్నాయి. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు. ఇదే ఓ పెద్ద ఉదాహరణ.


మనకు ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ కావాలంటే.. ముందుగా వెతికేది గూగుల్ లోనే.. అది సరైనదా? కాదా? అనే విషయం అస్సలు పట్టించుకోం. వెంటే కాల్ చేశామా.. అన్నట్టుగానే ఉంటుంది. అదే  కొంప ముంచుతోందనేది గుర్తుంచుకోవాలి. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్‌, కొరియర్‌, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం.. ఇలా.. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చాలానే వస్తున్నాయి. సైబర్ మోసగాళ్లు.. గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి.. ఈ వివరాలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


సైబర్ మోసగాళ్లు... అన్నింటికీ కలిపి ఒక్కటే నంబర్ గూగుల్ లో పోస్ట్ చేస్తారు. అంటే.. ఏ కస్టమర్ కేర్ కైనా అదే నంబర్. వాళ్లు మాట్లాడే మాటలు మనం ఇట్టే నమ్మేస్తాం. చాలా తెలివిగా మాట్లాడతారు. వాళ్లు చెప్పింది ఈజీగా నమ్మేస్తాం. మనం ఎందుకు కాల్ చేశామో..మనతో చెప్పిస్తారు. రెండు నిమిషాల్లో ప్రాబ్లమ్ తీర్చేస్తామంటూ.. చెబుతారు. ఒక లింక్ ను ఫోన్ కు పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేసి.. వివరాలు నమోదు చేయాలంటారు. ఇలా మన బ్యాంకు వివరాలన్నీ లాగేస్తారు. ఆ తర్వాత ఫోన్ కు ఒక ఓటీపీ వస్తుంది. అది చెబితే ఫిర్యాదు రిజిస్టర్ చేస్తామని... చెప్పి.. ఇక డబ్బులు మాయం చేస్తారు.  బ్యాంకు నుంచి మెసెజ్ వచ్చినప్పుడు తెలుస్తోంది మోసపోయారు అని.  


కస్టమర్‌ కేర్‌ నంబర్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
                                                                - బాలకృష్ణారెడ్డి, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ


జార్ఖండ్... జాంతారా, దేవ్‌ఘడ్‌, గిరిడి.. ముఠాలు.. ఈ తరహా మోసాలు చేయడంలో ఆరితేరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మోసాల్లో 50 శాతం ఈ ముఠానే చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీళ్లకు ఊర్లోకి పోలీసులు వెళ్లగానే విషయం  తెలిసిపోతుంది. వీళ్లని పట్టుకోవడం కష్టమే. ఒకవేళ పోలీసులకు దొరికినా...డబ్బు రికవరీ  అవ్వదు.


Also Read: Illegal Affair Murder: కోడలితో వివాహేతర సంబంధం... ప్లాన్ చేసి కొడుకును హత్య చేసిన తండ్రి....అసలు విషయం ఎలా బయటపడిందంటే..!