Mla Jagga Reddy  : సీఎం జగన్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ వదిలిన బాణాలే అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా డైరెక్షన్ లో జగన్, షర్మిల పనిచేస్తు్న్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జగ్గారెడ్డి స్పందించారు. ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయం కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించి వివాదాలు సృష్టించడం వల్ల వైఎస్ఆర్ కు చెడ్డ పేరు వస్తుందన్నారు. వైసీపీలోఎన్టీఆర్‌ వద్ద పనిచేసిన వాళ్లే ఉన్నారన్న ఆయన... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్‌లోనే ఉంటే ఎలా ప్రశ్నించారు. 


మూడు రాజధానులపై 


ఏపీకి చెందిన రెండు కీల‌క అంశాల‌పై తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సోమ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు, ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి పేరు మార్పుపై  వైసీపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆయ‌న స్పందించారు. ఈ రెండు అంశాల్లోనూ ఏపీ సీఎం జ‌గ‌న్‌ నిర్ణయాన్ని జ‌గ్గారెడ్డి తప్పుబట్టారు.  ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పు స‌రికాద‌ని వ్యాఖ్యానించిన జ‌గ్గారెడ్డి.. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ నిర్ణయం సరికాదన్నారు.  ఏపీకి అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌నేది కాంగ్రెస్ నిర్ణయమ‌న్న జ‌గ్గారెడ్డి, ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంతో ఉందని వెల్లడించారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల నిర్ణయం స‌రికాదద‌న్న జగ్గారెడ్డి, మూడు చోట్ల మూడు రాజ‌ధానుల అభివృద్ధి సాధ్యం కాదని తేల్చేశారు. ఈ విష‌యంలోనే సీఎం జ‌గ‌న్‌ నిర్ణయం సరైంది కాదన్నారు. అమ‌రావ‌తి పేరుపై చంద్రబాబు విస్తృత దృక్పథంతోనే నిర్ణయం తీసుకున్నారని కూడా జ‌గ్గారెడ్డి తెలిపారు.


ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదు? 


సీఎం జగన్‌, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ఆర్ కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే ఊరుకుంటామా? అని మండిపడ్డారు. వైఎస్‌ షర్మిల కేవలం నాయకులను తిట్టేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. నేతలపై వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారన్నారు. తెలంగాణలో కూడా అలాంటివి చాలా ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ బాటలో షర్మిల నడవడంలేదన్నారు. ఇంతవరకు ఆమె బీజేపీని విమర్శించినట్లు ఎక్కడా చూడలేదన్నారు. ప్రధాని మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు. 


బీజేపీ డైరెక్షన్ లో 
 
సీఎం జగన్‌, షర్మిల ఇద్దరూ బీజేపీ వదిలిన బాణాలే అని జగ్గారెడ్డి ఆరోపించారు.  ప్రధాని మోదీ, అమిత్‌షా డైరెక్షన్ లో వాళ్లు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసుల ఓటు బ్యాంకు చీల్చి బీజేపీకి ఉపయోగపడాలనేది ప్లాన్ లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా సంపాదించిన వాళ్ల గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.  


Also Read : KCR National Politics : టీఆర్ఎస్‌కూ కాంగ్రెస్ కూటమే ఆప్షనా ? జాతీయ రాజకీయాల్లో మార్పులతో కేసీఆర్‌కు కొత్త చిక్కులు !


Also Read : KTR News: న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు - అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కేటీఆర్