ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు గణేష్. ఓవరాల్ గా క్యారెక్టర్ లో ‘‘మా వాడు స్వాతిముత్యం అని హీరోయిన్ చెప్పడం’’ హీరోకి సరిగ్గా సరిపోయింది. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. కన్ఫ్యూజన్ గా కనిపిస్తున్న అమాయకుడిగా గణేష్ చక్కటి అభినయం ప్రదర్శించారు. ప్రేమ, ఎమోషన్స్, కామెడీ అన్నింటినీ ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు.
‘‘మిమ్మల్ని చూడగానే నచ్చేశారు, అది ఎంతగా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరిని చూడకూడదని ఫిక్స్ అయ్యేంతగా’’ అని బిడియంగా హీరోయిన్ కి తన ప్రేమ విషయం చెప్పడం చాలా క్యూట్ గా ఉంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మని అందంగా చూపించారు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమకి చిన్న సమస్య అడ్డు వస్తుంది. హీరో ఎలా పరిష్కరించాడు, తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హీరో తండ్రిగా రావు రమేష్ నటించారు. తన ప్రేమ దక్కించుకోవడానికి హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. 'నేను నిన్ను ఏం అననులే వెళ్ళి పిల్లని తీసుకొచ్చేయ్'’ అని తండ్రి అంటే ‘‘ఏ పిల్ల’’ అని హీరో అమాయకంగా అడగటం బాగుంది. ‘‘చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడం కోసం మళ్ళీ మునులు, దేవుళ్ళని అడ్డం పెట్టుకోవడం, కళ్ళు పోతాయిరా ఎదవల్లారా’’ అని రావు రమేష్ హీరోని తిట్టడం వంటి సీన్స్ బాగున్నాయి.
Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!
ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితం, ప్రేమ, పెళ్లి వంటి వాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాటి మధ్య య్ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందనేది ఇందులో చూపించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘చూసి చూడంగానే’ సినిమాతో వర్ష బొల్లమ్మ తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇటీవల ఆమె నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి