CM KCR Meets Vijay Darda : మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, లోక్ మత్  మీడియా సంస్థల ఛైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. స్నేహపూర్వకంగా సమావేశమైన విజయ్ దర్డా ఆయన రాసిన రింగ్ సైడ్ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు అందించారు.  ఆయన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి, జ్జాపికను అందచేశారు.

  






ఉత్తర ప్రదేశ్ కు చెందిన దళిత నాయకుడు రాఘవేంద్ర కుమార్ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయన్నారు. సంక్షోభ వాతావరణం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రతిష్టను దిగజార్చే పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం తక్షణావసరమని రాఘవేంద్ర కుమార్ స్పష్టం చేశారు. 


అగ్రస్థానంలో తెలంగాణ  


 సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని రాఘవేంద్ర కుమార్ అన్నారు. అక్కడే ఆగిపోకుండా తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిదుతున్న తీరు అమోఘమన్నారు.  సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షను, అందిస్తున్న సుపరిపాలనను ఆయన కొనియాడారు. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్జత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ నుంచి ఎదగడం దేశానికి శుభ సూచకమని  అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ పాలనానుభవం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ప్రజల గుణాత్మాకాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరమున్నదన్నారు. 
కేసీఆర్   లాంటి  ప్రత్యామ్నాయ  నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ ను రాఘవేంద్రకుమార్ ఆహ్వానించారు. 


Also Read : YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు


Also Read : KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !