ABP Southern Rising Summit 2024: భారత్ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది.. కానీ ఒక దేశం ఒకే ఎన్నికలు ఉండాలని గానీ, ఒక మతం, ఒకే భాష ఉండాలని బలవంతం చేయలేమని డీఎంకే ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ కనిమొళి సోము అన్నారు. భారత్ అనేది ఉపఖండం అని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం ఓ విషయంలో భిన్నంగా ఉంటుందని.. ఇదే భిన్నత్వంలో ఏకత్వం అని కనిమొళి అన్నారు. ప్రతి రాష్ట్రానికి భిన్నమైన పాలసీలు, అవసరాలు ఉంటాయని.. ఎప్పటికీ దేశంలో ఇలాంటి పరిస్థితులు అలాగే కొనసాగాలని డీఎంకే భావిస్తోందన్నారు. రాష్ట్రాలకు అధికారులు ఉండాలని, కానీ ఒకేదేశం ఒకే పాలసీ లాంటివి మనకు వీలుకాదని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకురాలు మాధవీలత చెప్పినట్లు క్రికెట్ వేరు, దేశంలో రాజకీయాలు వేరన్నారు. భిన్న రాష్ట్రాలు ఉన్నా, దేశం విషయానికొస్తే అంతా ఒకటేనని.. భారత దేశమంటారు. కానీ ఒక్కో రాష్ట్ర ఆటగాడని భిన్నంగా చూడరని చెప్పారు. క్రికెటర్లు అందరికీ ఒకే భాష ఉండాలని లాంటివి అవసరం లేదని కొట్టిపారేశారు. అన్ని రాష్ట్రాలకు తగినట్లుగా పాలసీలు ఉండాలని, కానీ ఒకే దేశం ఒకే మతం, ఒకే పాలసీ, ఒకే ఎన్నికలు లాంటివి అవసరం లేదన్నారు.
ఉదయనిధి కామెంట్స్ పై డీఎంకే ఎంపీ రియాక్షన్ ఇదీ
నార్త్ ఇండియాలో సనాతన ధర్మం ఐడియాలిస్టిక్ గా ఉంటుంది, కానీ మీ నేత ఒకరు సనాతన ధర్మాన్ని డెంగ్యూ దోమ అంటూ కామెంట్ చేయడంపై అడగగా.. పాలిటిక్స్ లో మహిళలు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడాలన్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పారంటే.. ద్రవిడ నేతలు పెరియార్, అన్నాదురై, కరుణానిధిలు మహిళలపై వివక్షను ప్రశ్నించారు. మహిళకు ఎలాంటి స్వేచ్ఛ లేని సనాతన ధర్మం అవసరం లేదని వారు చెప్పిన విషయాలను ఉదయనిధి గుర్తుచేస్తూ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా అన్నారు. అందుకే మహిళలకు సమానత్వాన్ని ఇవ్వాలి కనుక సనాతన ధర్మం ఉండకూడదన్నారని కనిమొళి స్పష్టం చేశారు.
పెరియార్ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ అలాంటి ధర్మాన్ని లేకుండా చేయాలని చెప్పడమే ఉదయనిధి ఉద్దేశమన్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నడుస్తున్న డ్రవిడ ప్రభుత్వం దేవుళ్లకు వ్యతిరేకం కాదు. HRNC శాఖ వేల ఆలయాలను రీడిజైన్ చేసిందని కనిమొళి తెలిపారు.
ABP నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్, బీజేపీ ఫైర్ బ్రాండ్ కొంపెల్ల మాధవీలత, డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి సోము, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న తిరునగరి పాల్గొని రాజకీయాల్లో మహిళల పాత్ర.. ఇంకా ఏం చేయాల్సి ఉంటుందో మాట్లాడారు. రాజకీయాల్లో మహిళకు ప్రాధాన్యం పెరగాలని, అందుకు చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ABP Southern Rising Summit 2024 Live Updates కోసం క్లిక్ చేయండి