Seetakka LLM : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశం కోసం ఎంట్రన్స్ పరీక్ష రాశారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా.. ఎల్ఎల్‌ఎం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆమె ఎంట్రన్స్ రాస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. 'నేను నా ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష రాశాను. విద్యార్థి జీవితమే ఉత్తమ జీవితం' అంటూ పోస్టు చేశారు.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఆమె ప్రయత్నాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అభినందించింది. అభినందనలు తెలిపింది.
బాసర ట్రిపుల్ ఐటీలో ఎక్కడేసిన గొంగళి అక్కడే! ఫుడ్ పాయిజన్ జరిగినా ఏం మారలా!
ధనసరి అనసూయ నిరుపేద కుటుంబంలో పుట్టారు. మొదట్లో నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. చాలా కాలం నక్సల్ ఉద్యమంలో పని చేశారు. ఆ ఉద్యమం సమయంలోనే ఆమె పేరు సీతక్కగా మారింది. అదే అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చదువు కూడా కొనసాగించారు.
కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి సీనియర్ నేత! ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు - అమిత్ షాతో భేటీ?
ఆమె పేదలకు సేవలు చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో మరుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఆకలితో అలమటించకుండా.. తన నియోజకవర్గం అనే కాకుండా మొత్తం గిరిజన ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు.
ఆమె ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు.