CBSE 10th Result 2022 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో విద్యార్థులు పొందవచ్చు. CBSE అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లింక్‌లు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. CBSE 10వ ఫలితాల మార్క్ షీట్ కూడా DigiLockerలో అందుబాటులో ఉంచారు. సీబీఎస్ 10వ తరగతి పరీక్షలో 94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 1.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో 10వ తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- cbseresults.nic.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి
- 10వ తరగతి ఫలితాల కోసం ఇచ్చిన మూడు లింక్‌లలో ఒకదానిపై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్, స్కూల్, అడ్మిట్ కార్డ్ ID వివరాలు నమోదు చేయండి.
- విద్యార్థుల ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి
- భవిష్యత్తులో యాక్సెస్ చేయడానికి ఫలితాల PDFను డౌన్‌లోడ్ చేసుకోండి
DigiLockerలో CBSE ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- DigiLocker.gov.inపై క్లిక్ చేయండి.
- హోమ్ పేజీలో, లాగిన్ పై క్లిక్ చేయండి.
- మీ CBSE రోల్ నంబర్‌ను వినియోగదారు పేరుగా, PIN నెంబర్ పాస్‌వర్డ్‌గా ఉపయోగించి లాగిన్ చేయండి. (సీబీఎస్‌ఈ పాఠశాలలకు పిన్ నెంబర్ షేర్ చేసింది)
- విద్యార్థులు 10వ తరగతి మార్క్ షీట్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
- CBSE 10వ తరగతి ఫలితాల కోసం డిజిటల్ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈరోజు ఉధయం 11 గంటలకు సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in లేదా cbse.gov.in లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.
అమ్మాయిలదే పైచేయి.. అబ్బాయిలు అక్కడే!
మొత్తం 92.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 94.54 శాతం పాసవ్వగా.. బాలురలో ఇది 91.25 శాతంగా ఉంది. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించారని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. మొత్తం లక్షా 34 వేల మంది 90 శాతం కంటే అధికంగా మార్కులు పొందారని వివరించింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా తిరువనంతపురంలో 98.83 శాతం, బెంగళూరులో 98.16 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది