సోషల్ మీడియాకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇకపై గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్‌ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. కేంద్రం చెప్పిన, అభ్యంతరకరమైన కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేసేలా ఐటీ చట్టంలో సవరణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్‌ను "ఫ్లాగ్డ్‌"గా పిలుస్తారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోనుంది. అంతే కాకుండా, ఇంటర్మీడియరీ స్టేటస్‌లో భాగంగా..ఆయా సంస్థలకు లభించే రక్షణను కూడా కోల్పోక తప్పదని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.