Viral Video: కాలేజ్‌ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటేషన్- వీడియో వైరల్, ఒకరు అరెస్ట్!

ABP Desam   |  Murali Krishna   |  22 Jul 2022 11:40 AM (IST)

Viral Video: ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు కిస్సింగ్ కాంపిటేషన్ పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఒక బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాలేజ్‌ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటేషన్- వీడియో వైరల్, ఒకరు అరెస్ట్!

Viral Video: కాలేజీ విద్యార్థులు ఎక్కడైనా సింగింగ్ కాంపిటేషన్ లేదా క్విజ్ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం కిస్సింగ్ కాంపిటేషన్ పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే?

ఇదీ సంగతి

కర్ణాటకలో ఇద్దరు విద్యార్థులు కళాశాల యూనిఫాంలో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. స్నేహితులు పక్కన ఉండి వారిని ఉత్సాహపరుస్తుండగా వీడియోలో వీరు పోటీ పడి ముద్దులు పెట్టుకున్నారు. విద్యార్థిని, విద్యార్థి ముద్దు పెట్టుకుంటున్న ఈ వీడియో వైరల్‌ అయింది.

ప్రముఖ కళాశాలకు చెందిన ఓ యువకుడు, ఓ బాలిక ఇద్దరూ ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ఇలా కిస్ చేశారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు కళాశాల అధికారులు, తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

కిస్సింగ్ కాంపిటేషన్

విద్యార్థులు ముద్దుల పోటీ నిర్వహించినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. వీడియో తీసిన బాలుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వీడియో సర్క్యూలేట్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఘటన జరిగిన సమయంలో వీడియో తీసిన బాలుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆరు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ముద్దుల పోటీ నిర్వహించే సమయంలో విద్యార్థులు డ్రగ్స్‌ వాడారా లేదా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం.                    - ఎన్.శశికుమార్, మంగళూరు పోలీస్ కమిషనర్

వారం రోజుల క్రితం విద్యార్థి ఒకరు వాట్సాప్‌లో ఈ వీడియో పెట్టగా అది వైరల్‌గా మారింది. దీంతో కళాశాల అధికారులు విద్యార్థులను హెచ్చరించి వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కళాశాల అధికారులు, తల్లిదండ్రులు ఎవరూ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీడియో వైరల్ కావడంతో పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Corona Cases: కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా? 22 వేలకు చేరువలో కొత్త కేసులు

Also Read: Draupadi Murmu Profile: ద్రౌపది ముర్ము ఘనవిజయం- రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ

Published at: 22 Jul 2022 11:11 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.