CM Revanth Loan Waiver Scheme :  తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి ఏర్పాట్లు  శరవేగంగా చేస్తోంది. ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణమాఫీ చేసి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అప్పటి  వరకూ కాకండా ముందుగానే రైతుల అకౌంట్లలో రూ. లక్ష జమ చేయాలని నిర్ణయించారు. ల ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు.  18 సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో నిధులు జమ అవుతాయి.  అదే రోజు రైతు వేదిక ల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహిస్తారు. ఇంుదలో  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.  రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు.  రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 


కుటుంబానికి రూ. రెండు లక్షలు                                        


తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుం బానికి రూ.2 లక్షల మేర రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా  ప్రకటించారు.   రేషన్ కార్డుల ఆధారంగా డేటా బేస్ ను రెడీ చేశారు. కుటుంబాల ప్రాతిపతిక తీసుకున్నారు.  2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకూ పంట రుణాలు తీసుకున్నవారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందf.  రుణమాఫీపై రైతులకు ఉన్న అనుమానాలను పరిష్కరించాలని  అధికారులను ఇప్పటికే ఆదేశించారు.  


ఇప్పటికే బ్యాంకర్ల వద్ద నుంచి అందిన రుణఖాతాల సమాచారం                   


ఆగస్టు 15లోగా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి బ్యాంకర్ల వద్ద నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నంలో వ్యవసాయశాఖ ఉంది.  బ్యాంకర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రుణమాఫీ చేస్తున్నారు.  మార్గదర్శకాలలో కొంత గందరగోళం ఉండడంతో రుణమాఫీ అర్హుల జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. కటాఫ్‌ తేదీ ప్రకారం కొంత మంది రైతులు రుణాలు తీసుకొని  తిరిగి చెల్లించారు . వారు కొత్త రుణాలు తీసుకోకపోతే రుణమాఫీ వర్తిస్తుందా లేదా అన్న సందేహాలతో రైతుులు ఉన్నారు. వారందరికీ క్లారిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 


ఆగస్టు పదిహేను లోపు మరో రూ. లక్ష  


ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియ మొదలైంది.  భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2లక్షల వరకు పంట రుణమాఫీ వర్తించనుంది. ఈ పథకాన్ని స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపజేస్తారు. 2018 డిసెంబరు 12వ తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన, రెన్యూవల్‌ అయిన రుణాలకు, 2023 సంవత్సరం డిసెంబరు 9వ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. పౌరసరఫరాల శాఖ జారీ చేసిన ఆహారభద్రత కార్డును ప్రమాణికంగా తీసుకుంటున్నారు.  కుటుంం ప్రాతిపదికన తీసుకుంటున్నందున ఈ షరతులు పెట్టారు.