Agent TV Premiere Date Revealed: అక్కినేని యువ హీరో నిఖిల్ చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా సాలిడ్ హిట్ దక్కడం లేదు. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. అఖిల్ ఇండస్ట్రీలో రాణించడం కష్టమేనని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


నేరుగా టీవీలోకి వచ్చేస్తున్న‘ఏజెంట్‘


స్పై యాక్షన్ ‘ఏజెంట్’ మూవీ గత ఏడాది ఏప్రిల్ 28న విడులైనా, ఇప్పటి వరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు.  ఇప్పుడు టీవీలో టెలీకాస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే, తెలుగులో కాకుండా హిందీ వెర్షన్ మాత్రమే ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను గోల్డ్ మైన్స్ టీవీ చానెల్ వెల్లడించింది. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు ‘ఏజెంట్’ హిందీ వెర్షన్ ను టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గోల్డ్ మైన్స్ చానెల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. ఓటీటీలోకి రాకముందే నేరుగా టీవీల్లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించింది.


ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో?


‘ఏజెంట్’ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ ను సోనీ లివ్ దక్కిచుకుంది. అంతేకాదు, గత ఏడాది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. కారణాలు ఏంటో తెలియదు గానీ, ప్రసారం చేయలేదు. ఆ తర్వాత పలుమార్లు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పటికీ రాలేదు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి సోనీ లివ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను డిలీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? రాదా? అనే అనుమానాలు సినీ అభిమానులలో తలెత్తుతున్నాయి.


బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ‘ఏజెంట్‘


దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘ఏజెంట్‘ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ దెబ్బతో అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చాలా మంది భావించారు. కానీ, ఈ సినిమా విడుదలయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. తొలి షో నుంచే ఈ సినిమాపై భారీగా నెగెటివ్ టాక్ వచ్చింది. పట్టుమని రూ. 10 కోట్లు కూడా వసూళు చేయలేకపోయింది.


‘ఏజెంట్‘ సినిమాను అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ కు జంటగా  సాక్షి వైద్య హీరోయిన్‍గా చేసింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్, డెంజిలన్ స్మిత్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు.



Also Read: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?