బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే పాట మారుమోగిపోతంది. ఎక్కడ వినా... అదే పాట. సాయి శ్రీయ అనే పెళ్లి కూతురు.. బరాత్ లో చేసిన డ్యాన్స్ తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. ఒరిజినల్ పాటలో కొరియోగ్రఫీ కంటే.. పెళ్లి బరాత్‌లో వధువు చేసిన డ్యాన్సే ఆ పాటకు సూపర్ గా సెట్ అయిందనే ఫీల్ కలిగించింది. సాయి శ్రీయ డ్యాన్స్‌కు చాలామంది ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి పలువురు ప్రముఖులు సైతం సాయి శ్రీయ డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు. అనూహ్యంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న సాయి శ్రీయకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది.
మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రీయను రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ కు ఇచ్చి.. ఈనెల 14వ తేదీన పెళ్లి చేశారు. ఈ సమయంలో పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కు సాయి శ్రీయ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. మీడియా చానెళ్లు సైతం వీడియోను వేశాయి.
Samantha: ఎవర్నీ బాధపెట్టాలని అనుకోలేదు.. వారికి నా క్షమాపణలు: సమంత
'బుల్లెట్ బండి' ఒరిజినల్ పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సాయి శ్రీయకు ఆఫర్ ఇచ్చింది. తమ తదుపరి పాటలో నటించాలని ఆ సంస్థ నిర్వాహకురాలు.. నిరూప.. సాయి శ్రీయను కోరారు. ఈ మేరకు ఆమె ఫోన్‌లో సాయిశ్రీయతో మాట్లాడారు. బ్లూ రాబిట్.. రూపొందించనున్న పాటలో శ్రీయను లీడ్ రోల్‌లో నటించాలని కోరారు. దీంతో సాయి శ్రీయ సంతోషం వ్యక్తం చేస్తూ.. పాటలో నటించడానికి ఓకే చెప్పేశారు. మరి బుల్లెట్ బండి పాటతో ఆకట్టుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు నుంచి మరో అద్భుతమైన పెర్ఫామెన్స్ చూడవచ్చన్న మాట.
Also Read: Viral Video: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్.. బుల్లెట్ బండికి మించి ఈమె బల్లె.. బల్లె.. డ్యాన్స్