మెున్నటికి మెున్న.. బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. అనే సాంగ్ తెగ వైరల్ అయింది. తాను చేసుకున్న వాడిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ.. పాడుతోంది పెళ్లి కుమార్తె.  చేసుకున్న వాడితో ఎలా ఉంటాననే మాటలు చెప్పేస్తుంది. తనను అమ్మానాన్న ఎలా చూసుకున్నారో.. తానొస్తే.. ఇంట్లోకి లక్ష్మీ దేవిని వచ్చినట్టేనని.. చెబుతోంది. అయితే ఒకప్పుడు అత్త వైపు చూడాలంటే.. కోడలు తెగ భయపడిపోయేది. మా అత్త.. ఏమంటుందోనని.. ఆడపిల్ల భయం.. కానీ ఇప్పుడు అత్తతో కలిసి డ్యాన్స్ చేసే రోజులు వచ్చాయి. మంచి న్యూసే.


 



అప్పట్లో అత్తగారి ఇంట్లో అడుగు పెట్టడం అంటే భయపడిపోయేవారు కోడళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే.. మన సీరియల్స్ లో చూపే కన్నింగ్ అత్త... రియల్ లైఫ్ లో ఉండదు కాబట్టి. అప్పట్లో అత్తాకొడలంటే.. టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకునేవాళ్లు. అలా అని అందరు అత్తాకొడళ్లు కాదనుకోండి. కొంతమంది మాత్రమే. అలా ఉన్న వాళ్ల ఇంట్లో సీరియల్స్ లో అత్తాకోడళ్ల నడుమ నడిచే సీన్లు ఉన్నట్టే ఉండేవి. బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఒక్కటే తక్కువ.. మిగిలినదంతా సేమ్ టూ సేమ్.. అవే అత్తా సీరియస్ చూపులు.. అవే కోడలి బెదిరిపోయే చూపులు. భర్త రాగానే.. భర్య.. కంప్లైంట్.. నీకు భర్త అయితే.. నాకు కొడుకు అని తల్లి కంప్లైంట్.. ఇవన్నీ ఏంట్రా బాబు... అని తలపట్టుకుని బయటకు వెళ్లేవాడు పురషుడు. కానీ ప్రజెంట్ ట్రెండ్ మారింది.


[insta]






ఈ మధ్య కాలంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు కలిసి డ్యాన్స్ చేయడం ఎక్కువగా పెరిగింది.  కుటుంబ సభ్యులు కూడా కలిసి పాదం కలపడం కామన్ అయింది. ఈ కల్చర్ ఒకలా మంచి విషయమే. పెళ్లంటే.. భయం.. అత్తగారింట్లో ఎలా ఉంటుందోననే ఆలోచన దాదాపు పోతోంది. ముందే మెంటల్ గా అత్తాగారింట్లో.. ఫ్రీగా ఉండొచ్చనే ఆలోచన ఆడపిల్ల మనసులోకి వస్తుంది.  చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న.. తల్లిదండ్రులకు తన బిడ్డ ఎలా ఉంటుందోననే భయం కూడా ఇలాంటి కల్చర్ తో పోతోంది. పెళ్లి సమయంలోనే అర్థమైపోతోంది... అత్తగారింట్లో తమ బిడ్డ ఎలా ఉంటుందోనని.  అంతా కలిసి వేడుక చేసుకోవడమంటే.. ఆనందంగా ఉన్నట్టే కదా..



ఒకప్పటి అత్తాకోడళ్లలా ఇప్పుడు తక్కువ ఉన్నారు. ఒకవేళ ఉన్నా.. ఎక్కడో ఒక దగ్గర... తులసి వనంలో గంజాయి మెుక్కలా తక్కువగా కనిపిస్తారు. ఇప్పుడంతా  కోడళ్లను అత్తలు..కూతుర్ల లానే చూస్తున్నారు. వెళ్లేది అత్త ఇంట్లోకి.. కాదు.. అమ్మ ఇంట్లోకేనని కోడళ్లు అనుకుంటున్నారు.