ఇప్పుడు పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మారానికి చెందిన సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా అనే ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అలాంటి వెడ్డింగ్ వైరల్ వీడియోలే ఇంకా ఉన్నాయి.
బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా.. పాట.. తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఈ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
[insta]
ఈ మధ్య కాలంలో మరో వీడియో కూడా వైరల్ అయింది. ఓ క్రిస్టియన్ వెడ్డింగ్ లో వధువు దగ్గరకు వరుడు వస్తాడు. ఆ సమయంలో ఇద్దరూ కిస్ చేసుకుంటారు. ఓ మై గాడ్ అంటూ.. పెళ్లి కొడుకు వెనక్కు పడిపోతాడు. వెనకలే ఉన్న ఫ్రెండ్స్ అతడిని పట్టుకుని మళ్లీ ముందుకు తోస్తారు. ఈ వీడియో కూడా తెగ వైరలైపోయింది.
[insta]
కొంతమంది అమ్మాయిలు.. పెళ్లి చేసుకునే టైమ్ లో అసలు ఏం మాట్లాడకుండా ఉంటారు. మాట్లాడితే ఎవరేం అంటారోనని భయం. కానీ ఈ పెళ్లి కూతురుని చూస్తే ముక్కున వేలేసుకుంటారు. మీకు నవ్వొస్తుంది అనుకోండి. అసలు విషయం ఏంటంటే.. ఓ పెళ్లి కూతురు.. పెళ్లి జరిగే టైమ్ కి ఆకలేస్తుందని రెస్టారెంట్ కి వస్తుంది. వచ్చి బర్గర్ తింటుంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్ స్టాలో పోస్టు పెట్టిన వారు 'వెన్ బర్గర్ ఈజ్ లైఫ్' అనే క్యాప్షన్ పెట్టి వదిలారు.
పెళ్లి కొడుకు.. పెళ్లి పందిరి దగ్గరకు రావాలంటే.. కారు, ఏనుగు, గుర్రం ఇలా.. మనం చాలానే చూశాం. కానీ ఓ వ్యక్తి కాస్త క్రేజీగా వచ్చేశాడు. ఎలా అంటే ఫ్రెండ్ భుజాలపై ఎక్కి వస్తుంటే.. పక్కన చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కొన్ని రోజుల నుంచి వైరల్ అయిపోతుంది.
చేసుకునే అమ్మాయికి ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. అలానే ఓ వ్యక్తి.. కూడా చాలా సమ్ థింగ్ స్పెషల్ గా ఇచ్చాడు. ఎలా అంటే తాను చేసుకునే.. అమ్మాయి కుటుంబంతో కలిసి పెళ్లి జరిగే దగ్గరకు వస్తుండగా... పెళ్లి కొడుకు గట్టిగా విజిల్ వేశాడు. అక్కడున్న వాళ్లందరు షాక్ అయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.