సమంతా పట్టిందల్లా బంగారమే. తెలుగులో గానీ, తమిళంలో గానీ.. ఎక్కడ ఏ సినిమాలో నటించినా ఆమె విజయం సాధిస్తుంది. తాజాగా హిందీ వెబ్‌సీరిస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సైతం తన సత్తా చాటింది. రాజీ పాత్రలో జీవించింది. తమిళ ఈలం పోరాటయోధురాలిగా యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరగదీసింది. బోల్డ్ సీన్లలోనూ సహజంగా నటించి ఔరా అనిపించింది. అందుకే.. ఆమె దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-IIFM’ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. IIFM శుక్రవారం ఈ అవార్డుల జాబితాను ప్రకటించింది. 


వెబ్‌సీరిస్ విభాగంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంత కనబరచిన నటనకు ఈ అవార్డును లభించింది. ‘ప్యామిలీ మ్యాన్’ సీరిస్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కూడా ఇదే విభాగంలో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం గమనార్హం. ‘ఆకాశమే హద్దురా..’ (సూరరైపోట్రు) సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్యకు సైతం ఫీచర్స్ విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇదే విభాగంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ సైతం ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ‘షేర్నీ’ సినిమాలో ఆమె చూపిన నటనకు ఈ అవార్డు వరించింది. 


Also Read: సైమా 2020 అవార్డులు.. నామినేషన్లలో సత్తా చాటిన బన్నీ, మహేష్.. ఇదిగో జాబితా!


తాజాగా ప్రకటించిన సైమా అవార్డుల్లో కూడా సూర్య నటించిన ‘సూరరైపోట్రు’ సినిమాకు 14 విభాగాల్లో నామినేట్ అయ్యింది. సూర్య తర్వాత 12 విభాగాల్లో అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురంలో’, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు నామినేట్ అయ్యాయి. కన్నడంలో ‘లవ్ మాక్‌టైల్’, ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’, ‘ఫ్రెంచ్ బిర్యానీ’ సినిమాలకు పది నామినేషన్లు దక్కాయి. మలయాళ చిత్రం ‘అయప్పనం కోషియం’ చిత్రం 12 విభాగాలకు నామినేట్ కావడం గమనార్హం. కొద్ది రోజుల కిందట 2019 సంవత్సరానికి సైమా అవార్డుల్లో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహార్షి’ సినిమా 10 విభాగాలకు నామినేటైంది. తమిళంలో ‘అసురన్’ ,  కన్నడంలో ‘యజమానా’, మలయాళంలో ‘కుంబలంగి నైట్స్’ సినిమాలు సైమా నామినేషన్లలో ముందున్నాయి. 






Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత


Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్