భారత్​లో మరో టీకా వినియోగానికి అనుమతి లభించింది. జైడస్​ క్యాడిలా మూడు డోసుల టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కొవిడ్ టీకాలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీనిపై డీసీజీఐ నిర్ణయం తీసుకుంది.






గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ.. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్‌ టీకా. జులై 1వ తేదీన కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకొంది. 


క్లినికల్ ట్రయల్స్..


ఈ వ్యాక్సిన్ కు దేశంలో పెద్దఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు సంస్థ ప్రకటించింది. దాదాపు 50 కేంద్రాలల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో.. టీకా రెండు డోసులు పొందిన వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది. 12-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు 'జైకోవ్-డి' సురక్షితమని ప్రకటించింది. ఏటా 10-12 కోట్ల డోసులను తయారు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.


దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు జైడస్ టీకా​కు అనుమతి లభించడంతో వ్యాక్సినేషన్ కు మరింత బలం చేకూరింది.


ALSO READ: Covid19 Update: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుంది.. ఎందుకిలా?


మరో వ్యాక్సిన్..


కొవిడ్ 19 సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై భారత్ లో అధ్యయనం చేసేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధమైంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు దరఖాస్తు చేసుకుంది. 12-17 మధ్య వయసువారిపై ఈ పరిశోదన చేయనుంది.


ALSO READ: Covid-19 Vaccine for Kids: త్వరలోనే పిల్లలకు 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్