Covid-19 Vaccine for Kids: త్వరలోనే పిల్లలకు 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్

ABP Desam   |  20 Aug 2021 02:58 PM (IST)

దేశంలో 12-17 ఏళ్ల పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సీడీఎస్ సీఓకు దరఖాస్తు చేసుకుంది. త్వరలోనే పిల్లలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్

కొవిడ్ 19 సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై భారత్ లో అధ్యయనం చేసేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధమైంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు దరఖాస్తు చేసుకుంది. 12-17 మధ్య వయసువారిపై ఈ పరిశోదన చేయనుంది.

దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఈ నెెల మొదట్లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ శుఖ్ మాండవీయ తెలిపారు. 

కరోనాపై పోరాటంలో భారత్ కు మరో ఆయుధం దొరికింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఇప్పుడు మనకు అందుబాటులో 5 వ్యాక్సిన్ లు ఉన్నాయి. కరోనాపై మన పోరాటానికి మరింత శక్తి వచ్చింది.                 - మన్ శుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

అమెరికా సహా ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోన్న డెల్టా వేరియంట్ పై తమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని టీకా తయారీ సంస్థ తెలిపింది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే లో అనుమతి ఇచ్చింది. దీనితో పాటు 12-18 ఏళ్ల వయసువారిపై జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది.

భారత్ లో వ్యాక్సినేషన్..

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ కొత్త మైలురాయిని అందుకుంది. 50 కోట్ల (57,16,71,264)కు పైగా వ్యాక్సిన్ డోసులను ఇప్పటివరకు అందించింది. గత 24 గంటల్లో 48 లక్షలకు పైగా డోసులను (48,84,440) ప్రజలకు అందించింది.

పెరిగిన కేసులు..

దేశంలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాలు స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసులు 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. తాజాగా 18,86,271 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 36,571 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  అదే సమయంలో మరో 540 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. థర్డ్ వేవ్ మరింత భయంకరంగా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. 

Also Read:

COVID-19 Updates: తగ్గని కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో తాజాగా 36,571 మందికి కరోనా పాజిటివ్.. పెరుగుతున్న మరణాలు

Published at: 20 Aug 2021 02:54 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.