‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌ 2’తో హిందీలో అరంగేట్రం చేసిన సమంత అక్కినేని ఈ షోకి సంబంధించిన వివాదంపై స్పందించింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో తన పాత్ర వల్ల ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసినా వారందరినీ  క్షమాపణలు కోరుతున్నా అంది సామ్. రాజ్ & డికె సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో సామ్ హిందీ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రదర్శనను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ఐటి మంత్రి టి మనో తంగరాజ్ ఒక లేఖ రాశారు. ``ఈ సిరీస్ ఈలం తమిళుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా..   తమిళనాడు ప్రజలను కూడా బాధ పెట్టింది`` అని ఆరోపించారు. ఈ వెబ్ సీరిస్‌లో తమిళ ఈలం గురించి ప్రతికూలంగా సన్నివేశాల్ని చిత్రీకరించడమే కాకుండా..  సామ్ రాజీ పాత్ర పోషించడంపై తమిళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే సంగతి తెలిసిందే. 


అయితే.. సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా..  ఆ విమర్శలకు సమాధానం ఇచ్చింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు. హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కనుక నేను మీకు నచ్చని పని చేసినట్లయితే నన్ను క్షమించండి’’ అని సమంత తెలిపింది. 


Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు


ఈ విదాలను పక్కన పెడితే..  ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌సీరిస్‌తో సమంతా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లో సమంత అక్కినేని రాజి అనే తీవ్రవాది పాత్రలో నటించింది. ఇక ఇన్ని రోజులు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్-1’ మాత్రమే తెలుగులో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు.. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను కూడా తెలుగులో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత బుధవారం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఈ వెబ్‌సీరిస్‌ను ఇకపై తెలుగులో కూడా వీక్షించవచ్చంటూ ట్వీట్ చేసింది. తమిళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ వెబ్‌సీరిస్ అందుబాటులో ఉందని, మిస్ కాకుండా చూడాలని సమంత కోరింది. 


Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..


Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?


Also Read: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్.. పాపం అదొక్కటే తక్కువట, ఆ 4 అక్షరాలతో తంట!