Bandi Sanjay Open Letter To KCR: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లుగా సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఉద్యోగులను క్రమబద్దీకరణ అంశంపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడు ఉండబోరని, వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు? సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల ఇచ్చిన హామీ ఏమైందని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) తన లేఖలో ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలవైపు మొగ్గు చూపుతోంది. సెర్ఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలి. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ను సైతం క్రమబద్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ (సెర్ఫ్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. వారి సర్వీసును క్రమబద్ధీకరిస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మాట తప్పడం దారుణం అన్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణకు మీ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నమ్మించిన ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతోంది. మహిళా సాధికారత పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లం అయింది. సెర్ఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎప్పుడు పర్మినెంట్ చేస్తారో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖను విడుదల చేశారు.
Also Read: CM KCR: ఇది ఆరంభం మాత్రమే, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు అవసరం : సీఎం కేసీఆర్