Bandi Sanjay letter to Sarpanches: 73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు బండి సంజయ్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకోవద్దని, వారి కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లక్ష్యం అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని బండి సంజయ్ (BJP Telangana Chief Bandi Sanjay) అన్నారు.
సర్పంచ్‌లకు మద్దతుగా దీక్ష చేపడతాం..
సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలన్నారు. గ్రామాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, గ్రామసర్పంచ్‌ల హక్కులు పరిరక్షణ కోసం త్వరలోనే బీజేపీ శాఖ మౌనదీక్ష చేపడుతుందని సూచించారు. 2014 లో టీఆర్‌ఎస్ పార్టీ ‘‘గ్రామీణాభివృద్ధి ` పంచాయతీరాజ్ వ్యవస్థ’’ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దు, అధైర్యపడవద్దు. మీకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. గ్రామసర్పంచ్‌లు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత తమ పార్టీదే అని వారికి మద్దతుగా నిలిచారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామస్వరాజ్యం సాధిద్దాం. రామరాజ్యాన్ని నిర్మించుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, సర్కారు గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కార్యక్రమాలతో పాటు సర్పంచ్‌లకు ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు.
Also Read: Revanth Reddy: తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన దౌర్భాగ్యుడు - రేవంత్ రెడ్డి ధ్వజం