T Works Opening : తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టి వర్క్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. గురువారం ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీవ్ టి వర్క్స్ ను ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ను నెలకొల్పామని.. ఇందులో నుంచి వందల వేల స్టార్టప్ లు పనిచేస్తాయనితెలిపారు. గ్రామీణ ప్రాంత ఓత్సాహిక యువతకు టి వర్క్స్ ఉపయోగ పడుతుందన్నారు. టి వర్క్స్ కు స్కూల్ విద్యార్థులకు కూడా తీసుకు వస్తం.వారికి అవగాహన కల్పిస్తామని.. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటి హబ్ లలో శాటిలైట్ సెంటర్స్ పెడతామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ఇన్నోవేటర్స్ కు జిల్లాలో ఉన్న ఐటి టీమ్ గైడ్ చేస్తుందన్నారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామని గుర్తు చేశారు. ఔత్సాహిక యువకులు ఎవరు వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చినా మేము సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
దేశంలోనే వినూత్న ప్రయత్నం టీ వర్క్స్
టీ హబ్ -2 ను ఇటీవలే్ ప్రారంభించారు. టీ హబ్ -2కు సమీపంలోనే టీ వర్క్స్ కూడా నిరమించారు. ఐటీ కారిడార్‌లోని ఐటీ హబ్ పక్కనే 4.7 ఎకరాల్లో సుమారు 200 కోట్లతో టీ-వర్స్‌ను నిర్మించి తయారీ యంత్రాలను అందుబాటులో ప్రభుత్వం ఉంచింది. సృజనాత్మకతగలవారు ఎవరైనా ఆలోచనతో వచ్చి ఒక పూర్తిస్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా, అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగం ఒకే చోట కొలువుదీరి ఉంటుంది. మొదటి దశలో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ అవసరాలకు ఉపయోగించే ఉత్పత్తులను తయారు చేసేందుకు యంత్రాలను అందుబాటులో ఉంచారు.
గ్రామీణ స్థాయిలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు కొత్త ప్రయత్నం
మూడు దశల్లో నిర్మించే టీ-వర్స్ విస్తీర్ణంలో 2 లక్షలకుపైగా చదరపు అడుగులు ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూరల్ ఇన్పోవేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఆర్‌ఐడీపీ), హెల్త్ ఇన్నోవేషన్ డెవలప్ ప్రోగ్రాం (హెచ్‌ఐడీపీ)ను చేపట్టారు. టీ-హబ్ తరహాలోనే టీ-వర్క్స్‌ను ఆరేళ్ల క్రితమే బేగంపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తెలంగాణవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి, వారికి టీ -వర్క్స్‌లో చోటు కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీ-వర్క్స్ ప్రాంగణంలో ఒకేసారి 200 మందికిపైగా ఇన్నోవేటర్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండే యంత్రాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు 3 షిప్టుల్లో పనులు నిర్వహించుకొనే వీలుంది. సహకారాన్ని అందించేందుకు నిపుణులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు.
అందుబాటులో అధునాతన యంత్రాలు
భౌతికంగా ఒక వస్తువును తయారుచేయాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. ఖర్చుతో కూడుకొన్నందున ఔత్సాహికులు వీటిని సమకూర్చుకోవడం చాలా కష్టం. అలాంటి వారికి ఒక వేదికగా టీ- వర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో లేజర్ కటింగ్ యంత్రం, మిల్లింగ్, డ్రిల్లింగ్, కటింగ్, పాటరీ, సెరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్ యంత్రం, పీసీబీల తయారీ యంత్రం, డిజైన్ ఇంజినీరింగ్..ఇలా రకరకాల విభాగాలకు చెందిన అత్యంత ఖరీదైన యంత్రాలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో రూ.100 కోట్ల విలువ చేసే వివిధ యంత్రాలు అందుబాటులో ఉంచారు.మూడు దశలు పూర్తయ్యే నాటికి తయారీ రంగానికి అవసరమైన మరో రూ.100 కోట్ల విలువ చేసే యంత్రాలను ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి టీ-వర్క్స్ ప్రాంగణంలో అందుబాటులో ఉంచనున్నాయి