Breaking News Live Telugu Updates: కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Jul 2022 05:27 PM
కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

Kamareddy Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మెనూర్ గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఆటో ను లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో అక్కడికక్కడే  ఆరుగురు మృతి చెందారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. లారీ కింద నుంచి ఆటోను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  రోడ్డుపై నుంచి ఆటోను లారీ ఈడ్చుకుంటూ రోడ్డు పక్కకు వచ్చింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. 

Guntur Ganja Smuggling: లగ్జరీ కారులో గంజాయి రవాణా

గుంటూరు జిల్లా పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాను పట్టుకున్నారు. సుమారు ఐదు కిలోల గంజాయి దొరికిందని సమాచారం. ఇందులో బడా బాబుల పిల్లలు ఉన్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లగ్జరీ‌ స్పోర్ట్స్ కారులో ఓ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన పిల్లలు గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ABVP Bundh: రేపు ఏపీలోని అన్ని పాఠశాలలు బంద్: ఏబీవీపీ

ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బందుకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడారు. డీఎస్సీ నిర్వహించి 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

MP Revanth Reddy: ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం

ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద పరిస్థితిపై చర్చించాలని కోరారు. రాష్ట్రంలోని విపరీత వరద పరిస్థితుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీవ్రంగా నష్టపోతున్నారు.


11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2 వేల కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి. విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి.’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

CI Nageswara Rao: సీఐ నాగేశ్వర్ రావును ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్:  సీఐ నాగేశ్వర్ రావును ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన హయత్ నగర్ కోర్టు..
ఈ రోజు నుండి 22 వ తేదీ వరకు నాగేశ్వర్ రావును విచారించనున్న వనస్థలిపురం పోలీస్ లు..
అత్యాచారం జరిగిన ఘటనా స్థలంతో పాటు ఇబ్రహీంపట్నం  కార్ , ప్రమాదం స్థలంలో సీన్ రికన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు..

Nellore School Bus Accident: నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ బస్సు బోల్తా

  • నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ బస్సు బోల్తా..

  • చలం చర్ల వద్ద పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్తున్న బస్సు బోల్తా..

  • బస్సులో 17 మంది పిల్లలు, 8 మందికి గాయాలు

  • బస్సు వదిలేసి పరారైపోయిన డ్రైవర్

  • పిల్లలు ఆస్పత్రికి తరలింపు,

  • క్రేన్ తో బస్సుని పక్కకు తొలగించిన అధికారులు

Nirmal District: మంచినీటి కోసం రోడ్డుపై విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మంచినీళ్ళు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.  బియ్యం సరిగ్గా లేక తినే అన్నంలోను పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఉన్న బియ్యాన్ని రీసైక్లింగ్ కూడా చెపిస్తలేరని, అలాగే నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని, విద్యార్థులు ఎన్ని అవస్థలు పడ్డా అధికారులు మాత్రం విద్యార్థులను పట్టించుకోవడం లేదని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బాలికలు ధర్నాకు దిగారు. నీళ్ళు లేక అనేక అవస్థలు పడుతున్నామని, ఇంకా ఇలా ఎన్ని రోజులని భైంసా - నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి తమకు నాణ్యమైన భోజనం మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ కార్యచరణను ప్రకటిస్తామని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ..  పిల్లలు చెప్పేది వాస్తవమే.. మోటార్ పాడవ్వడంతో మంచి నీటి సమస్య ఏర్పడిందని, దీంతో స్థానిక సర్పంచ్ రాజేందర్ కు కాల్ చేసి ప్రస్తుతానికి గ్రామపంచాయతీ నీటి ట్యాంకర్ ని పంపించారని, ఈరోజు సాయంత్రం నాలుగు గంటలలోపు మోటర్ రిపేర్ చేసి పిల్లలకు మంచినీరు అందిస్తామని తెలిపారు.

Nizamabad Accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

  • నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై 44  రోడ్డు ప్రమాదం

  • రోడ్డుపై వద్ద ఆగి ఉన్న లారీ ని ఢీకొన్న కంటైనర్

  • ఇద్దరు అక్కడికక్కడే మృతి

  • మరొకరికి తీవ్రగాయాలు..

  • గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో నిర్మల్ ఆసుపత్రికి తరలించిన పొలీసులు..

  • రహదారిపై అయిదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

  • వాహనాలను బాల్కొండ మీదుగా మల్లింపు

Guntur Murder News: గుంటూరు పెదకాకానిలో మహిళ దారుణ హత్య

పెదకాకానిలో మద్యం మత్తులో దారుణం జరిగింది.  మహిళ దారుణ హత్యకు గురైది. ఈఘటన  పెదకాకాని శివారులోని యువజన నగర్ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన  ఝూన్సీకి ఇద్దరు సంతానం. గత కొం తకాలం క్రితం భర్త చనిపోయాడు. పెద్ద కుమా ర్తెకు కూడా భర్త చనిపోవడంతో పుట్టింట్లో తల్లి వద్దనే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన  రసూల్,  సతీష్ బాబు  తన కుమా ర్తెతో మాట్లాడుతున్నారని ఝాన్సీ అసభ్య పదజా లంతో కనిపించినప్పుడల్లా తిట్టేది. మద్యం అలవాటు ఉన్న ఆమెతో మంచిగా ఉన్నట్లు నటిం చిన రసూల్, సతీష్ ఆదివారం మద్యం తాగేం దుకు ఆటోలో పెదకాకాని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ వెనుక యువజన నగర్ సమీపంలో ఉన్న ప్లాట్లలోకి తీసుకొచ్చారు. ముగ్గురు మద్యం తాగారు. కారణం లేకుండా ఇంటివద్ద ఎందుకు తిడుతు న్నావంటూ నిలదీశారు. ముగ్గురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఝాన్సీని కర్రతో కొటి, బీరు బాటిళ్లతో విచక్షణార హింతంగా పొడిచి పారిపోయారు. అదే సమయం లో అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఝాన్సీ మృతి చెందింది. మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

India President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధం

  • భారతదేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్దం 

  • నేడు ఉదయం గం.10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

  • పార్లమెంటు, రాష్ట్రాలలో, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్

  • రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టొరల్‌ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు

  • మొత్తం 4,809 మంది ఓటర్లు.. వీరిలో ఎంపీలు 776 మంది ఉండగా.. ఎమ్మెల్యేలు 4వేల 33 మంది

  • పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకొనున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యులు

  • రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,033 మంది శాసనసభ్యులు

  • ఈసారి రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఇద్దరు అభ్యర్థులు

  • ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ

  • ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు

  • రాష్ట్రపతి ఎన్నికల కోసం పార్లమెంట్ లో 6 పోలింగ్ బూత్ ల ఏర్పాటు

  • 5 రాష్ట్రాల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటులో రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు

  • తమ తమ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొనున్న ఉభయ సభలకు చెందిన 42 మంది ఎంపీలు

  • రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్

Background

నైరుతి రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర ఒడిశాకు అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు సౌరాష్ట్ర తీరంలోని ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన కేంద్రం, దీసా, రైసెన్, అంబికాపూర్, ఉత్తర ఒడిశా దాని పొరుగున అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి  వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.  నేడు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.