Breaking News Live Telugu Updates: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత నోవాక్ జకోవిచ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Jul 2022 10:31 PM
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత నోవాక్ జకోవిచ్

వింబుల్డన్ టెన్నీస్ పురుషుల సింగిల్స్ లో నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచారు. ఫైనల్ లో జకోవిచ్ నిక్ కైర్గోయిస్ పై ఘన విజయం సాధించాడు. ఏడో వింబుల్డన్ టోర్నీని జకోవిచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

Telangana Congress Protests: వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నిరసన

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ రెడ్డి  రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసు ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.


రేపటి వరకు సీఐ నాగేశ్వరరావును అరెస్టు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాం రెడ్డి,  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు శివసేన రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా హోమ్ మంత్రి మహమూద్ అలీ కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దర్పల్లి రాజశేఖర్ సుధీర్ రెడ్డి, జంగారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Congress Protest: సీఐ అత్యాచార ఆరోపణలపై నిరసనలకు కాంగ్రెస్ రెడీ

కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వర్ రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించనున్నారు. మహిళ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఎల్బీ నగర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ ముట్టడి జరగనుంది. చైతన్యపురి కాంగ్రెస్ కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలు. కొద్దిసేపట్లో బయలుదేరుతారనున్నారు.

Vijayawada: కూలిన రీటైనింగ్ వాల్, తిరిగి నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి

విజయవాడ 50 డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతం రావిచెట్టు రోడ్డు రిటైనింగ్ వాల్ కూలిపోయింది. రావి చెట్టు రిటైనింగ్ వాల్ కొండ ప్రాంతంలో వందలాది కుటుంబాల ప్రయాణించే ప్రధాన అడ్డరోడ్డుగా ఉంటుంది. అందువలన అధికారులు వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందుల్ని పరిష్కరించే విధంగా రోడ్డు నిర్మాణం కూడా చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కి స్థానికులు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొండ ప్రాంతం రిటైనింగ్ వాల్స్ ప్రమాదకరంగా ఉన్న వాటిని నిర్మించవలసిందిగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జెండా చెట్టు ఏరియా, కోకిలగడ్డ కొండలరావు ఇంటి వీధి, నూకాలమ్మ గుడి రోడ్డులో ఇంకా ప్రమాదకరంగా ఉన్న రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.

Tirumala News: పాలనపై స్పందన తెలుసుకునేందుకే ప్లీనరీ - డిప్యూటీ సీఎం

మూడేళ్ళ వైసీపీ పాలనపై ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకునేందుకు సీఎం జగన్ ప్లీనరి సమావేశాలు నిర్వహించారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా ప్లీనరి సమావేశాలకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారన్నారు..


పేదల తలరాత మారుస్తూ, అనేక సంక్షేమ కార్యాక్రమాలను చేస్తూ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు వాగ్దానాలను ప్రజలు నమ్మేస్థితిలో లేదన్నారు.. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు..85 శాతం ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు.. అన్ని పార్టీలు,ఎల్లో మీడియాతో పాటు దత్త పుత్రుడు సైతం ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.. నిత్యవసర ధరలతో పాటు పెట్రోల్ ధరలను పెంచేది కేంద్ర ప్రభుత్వమని ఆయన గుర్తు చేసారు.. చంద్రబాబుకి సపోర్ట్ చేసేవాళ్ళు పిచ్చి వాళ్లుగా మిగిలి పోతారే కానీ ప్రజా నాయకులుగా వారు పనికి రారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు.

Sri Ram Sagar Project: శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తుతున్న వరద, వారంలో 33 టీఎంసీలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగుతోoది. ప్రాజెక్టులోకి 4,92,415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 57 టీఎంసీలుగా ఉంది, పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు. కేవలం వారం వ్యవధిలోనే 33 టీఎంసీల వరద వచ్చి చేరింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక సాగునీటి డోకా ఉండబోదని వారు అంటున్నారు. భారీ వరద వస్తుండటంతో కందకుర్తి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 3 నదుల త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. ఉమ్మడి జిల్లాలో చిన్నతరహా ప్రాజెక్టులు పోచారం, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులు పూర్తిస్థాయికి చేరాయి. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

Background

ఉపరితల ఆవర్తనం వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి ఏడున్నర కి.మీ వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ిది నైరుతి దిశకు వంగి ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


మరో రెండు నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు అనూప్ గఢ్, సికర్, గ్వాలియర్, సక్నా, పెండ్రా రోడ్, సెంటర్ గుండా వెళుతుంది. ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పమైన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర , యానాంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు  వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేపు, ఎల్లుండి సైతం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఇంకా చినుకు కూడా పడలేదు. దీంతో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.


హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 
జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.