Breaking News Live: సీఎం కేసీఆర్‌తో పని చేయడం చాలా కష్టం - తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Apr 2022 03:03 PM
Telangana Governor Comments: తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరిగిన వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. తాను ఇద్దరు సీఎంలతో పని చేస్తున్నానని, ఇద్దరి మనస్తత్వాలు భిన్నమైనవని అన్నారు. ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు నియంత్రుత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

Karimnagar Court: సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చిన వ్యక్తి వడదెబ్బతో మృతి

Karimnagar Court: కరీంనగర్‌లో విషాదం జరిగింది. వడదెబ్బతో ఓ వ్యక్తి కోర్టు ఆవరణలో మృతిచెందాడు. దుర్షేడ్ గ్రామానికి చెందిన సొనకుల రాములు ఓ కేసు విషయంలో కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కరీంనగర్ కోర్టుకు వచ్చాడు. వడదెబ్బ తగలడంతో కుప్పకూలిపోయాడు. 108 లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే రాములు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

Acharya Movie: ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

* ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేనాని


* ఈ నెల 23వ తేదీ హైదరాబాద్ వేదికగా జరగనున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ప్రీ రిలీజ్ వేడుక


* ముఖ్య అతిథిగా పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్


* మొదట విజయవాడ కేంద్రంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సన్నాహాలు చేశారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం కూడా జరిగింది.


* తరువాత వేడుకను హైదరాబాద్ కు మార్చిన చిత్ర యూనిట్


* ఒకే వేదికపై సందడి చేయనున్న మెగాస్టార్, పవర్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్

KTR inaugurates Bahadurpura Flyover: బహదూర్ పురా ప్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR inaugurates Bahadurpura Flyover: విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి  కేటీఆర్ ప్రారంభించారు. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్ నగర్ జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు పాతబస్తీలోని బహదూర్ పురా జంక్షన్ వద్ద టీఆర్ఎస్ సర్కార్ ఫ్లై ఓవర్ నిర్మించింది. వీటితో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు  పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Bandi Sanjay Praja Sangrama Yatra: 6వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేడు 6వ రోజు ప్రారంభమైంది. గద్వాల నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నేడు బండి సంజయ్ తో పాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాదయాత్ర చేస్తున్నారు. 6వ రోజు పాదయాత్రలో భాగంగా ఎల్కూర్, నెడిపల్లి స్టేజ్, చెర్లగార్లపాడు స్టేజ్ మీదుగా ఎద్దులగూడెం వరకు 13 కి.మీ. మేర యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్ పాదయాత్రకు తరలివస్తున్న బిజెపి కార్యకర్తలు, యువకులు.

Madhu Yaskhi Khammam Tour: నేడు ఖమ్మంలో పర్యటించనున్న టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ

Madhu Yaskhi Khammam Tour:  టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మే 6వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ పై సమీక్ష నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో రాహుల్ గాంధీ సభపై సమీక్ష చేయనున్న మధు యాష్కీ. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. సాయంత్రం మధిరలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో మధుయాష్కీ పాల్గొననున్నారు. 20వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 

YS Jagan Vizag Tour: ఏపీ సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ - మధ్యాహ్నం హర్యానా సీఎంతో భేటీ

YS Jagan Vizag Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:25 నిమిషాలకు ఏపీ సీఎం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11:05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి దాదాపు 12 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు చేరుకుంటారు. ఏపీలో పర్యటిస్తున్న హర్యానా సీఎం ఖట్టర్‌తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అసలు ఏ విషయాలపై వీరు చర్చిస్తారు. ఎందుకు ఈ భేటీ అనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. హర్యానా సీఎంతో భేటీ అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి ఏపీ సీఎం జగన్ చేరుకోనున్నారు.

Mahabubabad: దేవతకు 20 దున్నలను బలి ఇచ్చిన వ్యక్తులు

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామ పరిధిలోని జెండాల తండాలో జంతు బలుల వ్యవహారం సంచలనంగా మారింది. కాళీమాతకు పూజల పేరుతో తండావాసులు దాదాపు 20 దున్నలను బలి ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. దున్నల తలలు తెగిపడేలా భయంకరంగా నరికేశారు. అత్యంత పాశవికంగా దున్నల తలలు నరకడంపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. దున్నల తలలు నరికే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Peddapalli: పెద్దపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య - ఇద్దరూ మైనర్లే

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకులలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరూ మైనర్లే. కులాలు వేరుకావడం, పెళ్లి వయసు రాకపోవడంతో వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు శివ పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి చనిపోయాడనే విషయాన్ని తెలుసుకొని ప్రియురాలు సుస్మిత కూడా  బావిలో దూకింది. ఇద్దరు మృతి చెందడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Background

అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాం, ఒడిశాలలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరశాఖ అధికారులు సూచించారు. 


విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నంలో, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని అంచనా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం-నర్సాపురం పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. కృష్ణా జిల్లా కైకలూరు దాక వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 


కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజమండ్రి, యానం, కొనసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు (Temperature in Andhra Pradesh) దిగొస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ముఖ్యంగా అన్నవరం, పితాపురంలలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంబాల కింద, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. 


కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగుల సూచన ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బేతంచెర్ల​-ఆధోనీ పరిధిలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాలు ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు 
నల్లమల అటవీ ప్రాంతాలతో పాటు నందికొట్కూరు - నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉంది.


తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం (Telangana Temperature Today) లభించింది. అయితే రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని, తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నేడు సైతం చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.