AP Cricketers Sold at IPL 2025 Auction : అమరావతి: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్లను అదృష్టం వరించింది. ఏపీకి చెందిన ముగ్గురు క్రికెటర్లను ఫ్రాంచైజీలు వేలంలో తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఏపీకి చెందిన యువకులు సోల్డ్ అయ్యారు. షేక్ రషీద్, పైల అవినాష్, సత్యనారాయణ రాజులను వేలంలో తీసుకోవడంతో ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. 



ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుంటూరుకి చెందిన షేక్ రషీద్‎ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు చెన్నై మరోసారి షేక్ రషీద్ ను తీసుకుంది. గతంలోనూ చెన్నై షేక్ రషీద్ ను తీసుకోవడం తెలిసిందే. చెన్నై అతడిపై నమ్మకం ఉంచి మరోసారి వేలంలో తీసుకుంది. షేక్ రషీద్ ఇదివరకే ఐపీఎల్ వేలంలోకి సోల్డ్ అయిన క్రికెటర్ కాగా, సత్యనారాయణ రాజు, పైల అవినాష్ లకు మాత్రం వేలంలోకి రావడం ఇదే తొలిసారి.


తూర్పు గోదావరి జిల్లా చెందిన సత్యనారాయణ రాజు‎ సైతం వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్ కు నిలిచిన సత్యనారాయణ రాజు‎ను తీసుకుంది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై జట్టు సత్యనారాయణను తీసుకోవడం విశేషం. విజయవాడకు చెందిన క్రికెటర్ పైల అవినాష్‎ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్ కు  పంజాబ్ కింగ్స్ పైల అవినాష్ ను కొనుగోలు చేసింది.  



తెలంగాణ యువ క్రికెటర్ కు నిరాశ
మరో తెలుగు యువ క్రికెటర్ ఐపీఎల్ వేలానికి రిజస్టర్ చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ అతడ్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. కానీ వేలంలో అవనీష్ రావు అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. భారత అండర్ 19 ప్రాతినిథ్యం వహించిన అవనీష్ ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో నిరాశే ఎదురైంది. 


Also Read: Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!