Bhuvneshwar Kumar has been acquired by RCB for Rs 10.75 crore | హైదరాబాద్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రీటెయిన్ చేసుకోవలేదు. వేలంలోకి వదిలేయడంతో ఈ ఫాస్ట్ బౌలర్ కోసం వేలంలో పోటీ నెలకొంది. చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువనేశ్వర్ ను దక్కించుకుంది. జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో రూ.10.75 కోట్లు చెల్లించి మరీ ఆర్సీబీ భువనేశ్వర్ ను తీసుకుంది.
బౌలర్ భువీని దక్కించుకున్న వెంటనే ఆర్సీబీ సోషల్ మీడియాలో భారీ ఎలివేషన్స్ ఇచ్చింది. చిరుత లాంటి వేగమైన ఎత్తుగడతో భువీని సొంతం చేసుకున్నామని పోస్ట్ చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను సైతం ఆర్సీబీ దక్కించుకుంది. వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి పాండ్యా బిగ్ బ్రదర్ కృనాల్ ను రూ.5.75 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్ట్
గత కొన్నేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ ను నడిపిస్తున్న భువనేశ్వర్ కుమార్ ను ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకోలేదు. దాంతో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ వేలంలోకి వచ్చాడు. కాగా, భువనేశ్వర్ ను దక్కించుకునేందుకు పోటీ నడించిందంటే అతడి ప్రాధాన్యత తెలుస్తుంది. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ భువీని తీసుకోకపోవడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. జట్టుకు కీలక విజయాలు అందించిన భువనేశ్వర్ ను ఎలా వదిలేశారని సన్ రైజర్స్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మిస్ యూ భువీ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
సన్ రైజర్స్‌ను ఐపీఎల్ విజేతగా నిలపడంతో భువీ కీలకపాత్ర
బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు భువనేశ్వర్. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ తో దిగ్గజ క్రికెటర్లను తొలి ఓవర్లోనే ఔట్ చేసిన ఘనత భువీ సొంతం. తొలి అంతర్జాతీయ టీ20లో తొలి ఓవర్లో వికెట్ తీశాడు. అదే విధంగా తాను ఆడిన తొలి వన్డేలో తొలి బంతికే వికెట్ తీయడం భువనేశ్వర్ ప్రత్యేకత. ఐపీఎల్ లో పుణే వారియర్స్, సన్ నైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2014 ఐపీఎల్ వేలంలో 4.25 కోట్లకు సన్ రైజర్స్ భువీని తీసుకుంది. 2016 సీజన్ లో 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సన్ రైజర్స్ ను ఐపీఎల్ విజేతగా నిలపడంలో కృషిచేశాడు. 2018లో సన్ రైజర్స్ కు వైస్ కెప్టెన్ గా చేశాడు. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో కెప్టెన్ గా సేవలు అందించాడు. 2022 మెగా వేలంలో సన్ రైజర్స్ రూ.4.20 కోట్లకు భువనేశ్వర్ ను దక్కించుకుంది. ఇటీవల రీటెయిన్ చేయకపోవడంతో వేలంలోకి వచ్చాడు. అయితే అంచనాలు అందుకుంటూ భువనేశ్వర్ భారీ ధర పలికాడు. అతడి నమ్మకం ఉంచి రూ.10.75 కోట్లకు ఆర్సీబీ భువీని తీసుకుంది.
Also Read: Kavya Maran Net Worth: ఐపీఎల్ వేలంలో కావ్య పాప స్పెషల్ అట్రాక్షన్ - ఆమెకు ఉన్న ఆస్తులు ఎంతో తెలుసా?