మంచిర్యాల జిల్లాలో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న జనగర్జన సభలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. నేడు (అక్టోబరు 10) మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కి చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు పయనం అయ్యారు. హెలికాప్టర్‌లో వచ్చిన అమిత్ షాకు ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు తదితరులు ఘన స్వాగతం పలికారు. 4 గంటల వరకూ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.


రాత్రికి బీజేపీ నేతలతో భేటీ
తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలతో అమిత్ షా చర్చిస్తారు. హైదరాబాద్‌లో రాత్రి 7.30 కు ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన వేళ ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు. ఆ సమావేశం ముగిశాక రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.