హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులను పాకిస్తాన్ చంపుతుంటే పాక్‌తో క్రికెట్ ఆడడం ముఖ్యమా అని విమర్శించారు. అలాగే వేరే మతం అబ్బాయిలతో ముస్లిం యువతులు తిరిగితే దాడులు చేయడానికి మీరెవరని అసదుద్దీన్ నిలదీశారు. ముస్లిం యువతి, ఇతర మతాల యువకులపై దాడిచేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దారుణమన్నారు. వేరే మతం యువతులు, ముస్లిం యువకులతో తిరిగితే సంతోషపడే వాళ్లు, ముస్లిం యువతులు తిరిగితే ఎందుకు దాడులు చేస్తున్నారన్నారు. ఇది కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంపై సమాజంలో మార్పు రావాలన్నారు. యూపీలో వచ్చే ఎన్నికల్లో యోగిని ఓడించి తీరుతామని అసదుద్దీన్ అన్నారు.
Also Read: జానారెడ్డి కన్నా ఈటల పెద్ద లీడరా ? 9 నెలలు పార్టీ పని మీదే ఉంటామన్న కేటీఆర్ !
మగాడికో న్యాయం?.. ఆడవాళ్లకో న్యాయమా?
హైదరాబాద్ లో జరిగిన మిలాద్-ఉన్-నబీ సభలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మగాడికో న్యాయం? ఆడవాళ్లకో న్యాయమా? అని నిలదీశారు. ముస్లిం అబ్బాయి ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం అమ్మాయి మాత్రం వేరే మతం వారితో కనిపిస్తే దాడులు చేస్తారా అని వ్యాఖ్యానించారు. ఇది 1969 కాదని 2021 కాలానికి తగ్గట్టుగా మారాలన్నారు. బుర్కా వేసుకున్న అమ్మాయి మరొకరితో కనిపిస్తే దాడులు చేస్తున్నారని, అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళితే ఆపడానికి సరికాదని అసదుద్దీన్ అన్నారు.
Also Read: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
చైనా చొరబాట్లపై మాట్లాడరెందుకు?
దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయాయని అసదుద్దీన్ విమర్శించారు. చైనాపై మాట్లాడేందుకు మోదీ భయపడుతున్నారని విమర్శించారు. చైనా భారత్ లో చొరబడితే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. హత్యలకు పాల్పడుతున్న నేరస్థులను సమాజం నుంచి బహిష్కరించాలని అసద్ అన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామన్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినా ప్రధాని మోదీ దాని గురించి మాట్లాడారు. చైనా భారత భూభాగంలోకి చొరబడిన చైనా గురించి ప్రధాని మోదీ మాట్లాడడానికి భయపడతారన్నారు. పుల్వామా ఘటనకి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పిన మోదీ చైనా చొరబడితే ఎందుకు మౌనంగా ఉన్నారని అసద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయని, ఉగ్రవాదులు చొరబడుతున్నారన్నారని కేంద్రంపై ప్రశ్నలు కురిపించారు అసద్.
Also Read: దళిత బంధు ఆపేసిన క్రెడిట్ ఎవరిది ? బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు !