Gruha Jyothi: కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల లోపు హామీలు అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్...అందుకు అనుగుణంగా వినియోగదారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆధార్(Aadhaar) కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని తెలిపింది.


ఆధార్ తప్పనిసరి
తెలంగాణలో గృహజ్యోతి(Gruha Jyothi) పథకం అమలకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఆధార్‌ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలిడెషన్ పూర్తిచేస్తేనే ఉచిత విద్యుత్ పథకానికి అర్హులవుతారని తేల్చి చెప్పింది.ఈ ప్రక్రియ మొత్తం డిస్కంల ప్రతినిధులే చేపడతారని తెలిపింది. లబ్ధిదారులు ఈ పథకంలో చేరేందుకు ఇంటి కరెంట్ మీటర్ ఎవరి పేరిట ఉందో వారి ఆధార్(Aadhaar) సిబ్బందికి చూపాలని నిబంధనల్లో పేర్కొంది.ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే అప్లయి చేసుకుని ఆ ఫ్రూప్ చూపిస్తే సరిపోతుందని..ఆధార్ వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డులు చూపి పథకంలో చేరొచ్చని తెలిపింది. బయోమెట్రిక్ వ్యాలిడేషన్ లో భాగంగా వేలిముద్రలు లేకుంటే కనురెప్పలను స్కాన్ చేయాలని విద్యుత్ శాఖ సిబ్బందికి అధికారులు సూచించారు. విద్యుత్ శాఖ వద్ద ఉన్న పరికరాలు పనిచేయకపోతే..ఆధార్ నెంబర్ నమోదు చేయగానే యజమాని ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ(OTP) ద్వారా ధ్రువీకరించుకోవాలని, ఆదీకాకపోతే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కానే చేసి వివరాలు సరిచూసుకోవాలని సూచించింది.


గుర్తింపు కార్డు తప్పనిసరి
ప్రభుత్వ రాయితీలు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరని ఉన్నతాధికారులు తెలిపారు. లేకుండా పథకం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.  బయోమెట్రిక్‌ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తిచేస్తేనే పేర్లు నమోదు చేస్తామని గెజిట్‌ నోటిఫికేషన్‌ లో పేర్కొన్నారు.  ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీచేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు ప్రభుత్వం సూచించింది.  విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ ను, లబ్ధిదారుల ఆధార్‌ తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాలు దిగ్విజయంగా అమలవుతుండటంతో మరో రెండు పథకాలు వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తోపాటు రూ.500లకే వంటగ్యాస్ అందించే పథకం అమలు కోసం కసరత్తు జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసే లోపు ఆరు గ్యారేంటీలు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులువేస్తోంది. అందులో భాగంగానే నిన్న గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. త్వరలోనే రాయితీ గ్యాస్ కనెక్షన్ విధివిధానాలు సైతం ఖరారు చేయనుంది. 


Also Read: ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ మార్చుకోవాలా?, ఒక్క రూపాయి కట్టకుండా ఆ పని పూర్తి చేయొచ్చు


Also Read: మీ ఆధార్‌తో ఏ మొబైల్ నంబర్ లింక్‌ అయిందో గుర్తు లేదా?, ఈజీగా కనిపెట్టొచ్చు