Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌కి ఫోన్ రావడంతో మాట్లాడి వస్తాను అని వెళ్తాడు. ఇక మురారి ఆదర్శ్‌కి మందు గ్లాస్ ఇస్తాను అని అంటాడు. దీంతో ముకుంద మురారి నేనే ఇస్తాను అని మందు గ్లాస్ పట్టుకొని వెళ్తుంది. ఆదర్శ్‌ని వెనుకనుంచి చూసి నిజం చెప్తేస్తా అనుకుంటుంది. మరోవైపు మురారి కృష్ణని బంగారం అని పిలిస్తే బిత్తర చూపులు చూస్తుంది కృష్ణ.


మురారి: జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా అదేంటి. 
కృష్ణ: కాసేపు ఆగండి మీకే తెలుస్తుంది. 
ముకుంద: (ముకుంద ధైర్యం కోసం మందు తాగేస్తుంది.) 
మురారి: కృష్ణ ఒకసారి అటు చూడు..
కృష్ణ: ముకుంద... ఏసీపీ సార్ ముకుంద ఎంజాయ్ చేయడానికి బాగా ఫిక్స్ అయిపోయింది. ఎక్కువ చూడకండి దిష్టి తగులుతుంది. 
ముకుంద: చెప్పేస్తాను.. ఆదర్శ్‌ వెనక్కి తిరగొద్దు అలాగే ఉండు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పక చెప్తున్నా నన్ను క్షమించు ఆది.. మురారి మాట కాదు అనలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మన పెళ్లి ఇష్టం లేదు. ఇప్పటికే కాదు ఎప్పటికీ నీ మీద ఇష్టం కలగదు. నీ భార్యగా ఉండలేక మీకు సంతోషం ఇవ్వలేక ఈ బతుకు బతకలేను.. ఆదర్శ్ షాక్ అయిపోతాడు. మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. సంతోషంగా ఉండండి. మిమల్ని నేను రమ్మనలేదు. నా మౌనాన్ని ఇష్టంగా అనుకొని కృష్ణ వాళ్లు పిలిచారు. నన్ను క్షమించు ఆదర్శ్‌. నన్ను మర్చిపోండి ఆదర్శ్. ఇక ఆదర్శ్ బ్లూటూత్‌లో ఫోన్ కాల్ కట్ చేస్తాడు. 
ఆదర్శ్‌: ముకుంద నువ్వు ఎప్పుడు వచ్చావ్. 
ముకుంద: ఇంత సేపు నేను చెప్పింది వినలేదు అన్నమాట. ఇప్పుడు ఏమైంది మళ్లీ చెప్తాను. ఆదర్శ్‌ అది.. 
ఆదర్శ్‌: ఓ నాకోసం గ్లాస్ కూడా తెచ్చావా..


ఇక మురారి వాళ్లు వచ్చి రూమ్‌లు రెడీ అయ్యాయి రండి అని పిలుస్తాడు. ముకుంద ఆదర్శ్‌తో ఒకే గదిలో ఉండలి ఎలా అనుకుంటుంది. ఇక ఆదర్శ్‌ రూమ్‌కి వెళ్లే సరికి బెడ్ అందంగా రెడీ చేసి ఉంటుంది. అది చూసి ముకుంద ప్లాన్ చేసింది అని ఆదర్శ్‌ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ముకుంద వచ్చి చూసి షాక్ అయిపోతుంది. 


ముకుంద: మనసులో.. ఇదంతా ఎవరు చేశారు. నా పేరు మీద రూంలు బుక్ చేయడమే కాకుండా శోభనానికి కూడా ఏర్పాట్లు చేశారు. భగవంతుడా.. బాగా ఇరుక్కుపోయానే.. 
ఆదర్శ్‌: డార్లింగ్ థ్యాంక్యూ థ్యాంక్యూ సో మచ్.. 
ముకుంద: ఆదర్శ్ ఒక్క నిమిషం.. అంటే గ్లాస్.. 
ఆదర్శ్: ఈ ఏర్పాట్లు చూసిన ఆనందంలో ఏం తెలియడం లేదు ముకుంద. నేను అంటే నీకు ఇష్టం లేదు అనుకున్నాను. కానీ నీ ఇష్టాన్ని ఇంత గొప్పగా చెప్తావు అనుకున్నాను.. 
ముకుంద: నేను కాదు ఆది.
ఆదర్శ్‌: నువ్వు కాదా.. ఇంకెందుకు దాయాలి అని చూస్తావ్.. నువ్వు సడెన్‌గా ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే ఏదో సరదాగా అనుకున్న ఇంత పెద్ద సర్‌ఫ్రైజ్ ఇస్తావు అనుకోలేదు. కనపడవు కానీ నువ్వు చాలా రొమాంటిక్ బంగారం.
ముకుంద: అసలు ఇదంతా ఎవరు చేశారు. అసలు ఎలా తప్పించుకోవాలి. 


మరోవైపు మురారి గదికి వచ్చినప్పటికి వాళ్ల బెడ్ కూడా శోభనానికి రెడీ చేసి ఐలవ్యూ అని రాసి ఉంటుంది. 
మురారి: ఇదేంటి శోభనం ఏర్పాట్లులా ఉంది. అయ్యో పాపం ఎవరో శోభనానికి ఏర్పాట్లు చేసి ఉంటే దారి తప్పి వచ్చేశా. కృష్ణని చూసి నువ్వు కూడా దారి తప్పి వచ్చావా.. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అంటే ఇది మన రూమే. మరి ఈసెటప్ ఏంటి.. ఏయ్ శోభనం మనకేనా.. అమ్మ తింగరి ఏం షాక్ ఇచ్చావ్.. మర్చిపోలేని బహుమతి ఇచ్చావ్ అంటే ఇదేనా.. చాలా సంతోషంగా ఉంది.. ఇది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును ముహూర్తాలు చూస్తావు కదా చూడలేదా..
కృష్ణ: చూడలేదు. మనసుకి నచ్చిందే ముహూర్తం అని పెట్టేశాను. 
మురారి: అవును ఆదర్శ్‌ ముకుందలకు.
కృష్ణ: వాళ్లకి కూడా ఏర్పాటు చేశా.. 
మురారి: ఇంతకీ వచ్చినప్పటి నుంచి మాతో ఉన్నావు కదా ఈ ఏర్పాట్లు అన్నీ..
కృష్ణ: ఫోన్‌లో చెప్పేశా.. 
మురారి: అంటే రూంలు కూడా..
కృష్ణ: నేనే.. 


ఆదర్శ్ ముకుందను దగ్గరకు తీసుకోవాలి అని అనుకుంటే ముకుంద గట్టిగా అరుస్తుంది. ఏమైంది అని ఆదర్శ్‌ అడిగితే ముకుంద ఏదేదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ముకుంద ఏదో షాక్ చెప్పి బయటకు వెళ్తుంది. ఇంతలో మురారి అక్కడికి వచ్చి ఆదర్శ్‌ని ఆటపట్టిస్తాడు. ముకుంద బయటకు వెళ్లిందని ఆదర్శ్‌ చెప్తే ఏదో స్పెషల్ పువ్వు తేవడానికి వెళ్లిందని చెప్తాడు ఆదర్శ్‌. ఇక మురారి వాళ్లు ఆదర్శ్‌ని ఆటపట్టిస్తారు. మరో వైపు ముకుంద బయట ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  ‘జగధాత్రి’ సీరియల్‌ ఫిబ్రవరి 20th: హోమం చేసిన ధాత్రి, కేదార్ - సైకోలా మారిన యువరాజ్