Update Address in Aadhaar Card: తెలంగాణ అడ్రస్‌తో మీకు ఆధార్ కార్డ్ ఉంటే, తెలంగాణలో ఈ మూల నుంచి ఆ మూల వరకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. ఒకవేళ, మీరు తెలంగాణలో నివశిస్తున్నా, మీ ఆధార్ కార్డ్‌లో తెలంగాణ అడ్రస్ లేకపోతే చింతించక్కర్లేదు. మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే, మీ ఆధార్ కార్డ్‌లోని అడ్రస్‌ను తెలంగాణ చిరునామాలోకి ఈజీగా మార్చొచ్చు. అదీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆ పని పూర్తి చేయొచ్చు.
ఆధార్ కార్డ్‌లో చిరునామాను మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్‌డేట్ మార్చుకోవడానికి, తప్పులు సరి చేసుకోవాలనుకోవడానికి ఇప్పుడు ఉచిత ఆఫర్ (Update Aadhaar Details For Free) నడుస్తోంది.
గత పదేళ్లుగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేయని వ్యక్తుల కోసం ఉడాయ్ (Unique Identification Authority of India - UIDAI) 'ఫ్రీ ఆధార్ అప్‌డేషన్' అవకాశం ఇచ్చింది. వాస్తవానికి, ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే చివరి తేదీ ఈ మధ్యే, డిసెంబర్ 14, 2023తో ముగిసింది. ఉడాయ్ దీనిని మరోమారు పొడిగించింది.
ఇప్పుడు, 2024 మార్చి 14వ తేదీ వరకు, ఇంటి అడ్రస్ సహా ఆధార్ వివరాలను ఉచితంగా (Last Date For Update Aadhaar Details For Free) అప్‌డేట్ చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసే వాళ్లకే ఈ ఛాన్స్. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం రాకపోతే.. ఆధార్ కేంద్రం/CSCకి వెళ్లి, అడ్రస్ సహా ఆధార్ సమాచారాన్ని మార్చుకోవచ్చు. దీనికి రూ.25 ఛార్జీ చెల్లించాలి. కానీ, అక్కడ ఒక్కో సవరణకు అనధికారికంగా రూ.100 వరకు వసూలు చేస్తున్నారు.
ఆధార్ కార్డ్‌లో అడ్రస్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card For Free?)
ఉడాయ్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్‌లోని అడ్రస్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేయొచ్చు. దీనికోసం, మీ దగ్గర తగిన రుజువు పత్రాలు ఉండాలి. మీ అడ్రస్‌ను మార్చుకోవడానికి... మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉన్న ఫోన్, స్కాన్ చేసిన ఐడీ ప్రూఫ్‌లు ను దగ్గర పెట్టుకోవాలి. ఈ పోర్టల్‌లో ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా మీ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
ముందుగా myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వండి
మీ పేరు/జెండర్/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్స్ ఎంచుకోండి
'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు, ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్ చేయండి
ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి ఆ నంబర్ ఉపయోగపడుతుంది. ఈ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ అడ్రస్‌కు కూడా వస్తుంది. అప్‌డేట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్‌డేషన్ స్టేటస్‌ను (Track Aadhaar Updation Status) ట్రాక్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సమయం లేదు మిత్రమా, మరో 2 రోజులు ఆగితే పెనాల్టీతోనూ ITR ఫైల్ చేయలేరు