Group 4 Exam : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గమనించారు. అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరీష్ ప్రకటించారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ల ఈ సంఘటన మినహా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు ప్రకటించారు.
పొరపాటున తీసుకెళ్లారా.? కాపీ కోసమా అన్నది తేల్చనున్న అధికారులు
టీఎస్‌పీఎస్‌ఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో పేపర్ల లీకేజీ జరగడంతో ఇటవల ఏ చిన్న అంశం జరిగినా సంచలనం అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని అందిప్చుచుకుని హైటెక్ పద్దతిలో కాపీయింగ్ చేస్తున్న వారిని ఇటీవల పట్టుకుంటున్నారు. అందుకే ఏ చిన్న ఎలక్ట్రానిక్ పరికారన్ని కూడా అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించడం లేదు. అలా తీసుకెళ్లినట్లుగా గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా సెల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థి తెలియక తీసుకెళ్లారా లేకపోతే.. ఉద్దేశపూర్వకంగా తసుకెళ్లారా అన్నది తేలాల్సి ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ - భారీగా పొంగులేటి వర్గం రాజీనామాలు !
రెండు సెషన్లలో ప్రశాంతంగా పరీక్ష - కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్- 4 పరీక్ష సజావుగా కొనసాగింది . అత్యధిక పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ సారి భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ కఠిన నియమాలు అమలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15నిమిషాలు ముందే గేట్లు మూసివేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులను అనుమతించలేదు.
ఇడుపులపాయకు సోనియా, రాహుల్ వస్తున్నారా ? నిజం ఎంత ?
ఉదయం సెషన్ పరక్షలో బలగం సినిమాపై ప్రశ్న
ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండటంతో ఈ సినిమా పై కూడా ప్రశ్నను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.