మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం సర్వసాధారణం. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా చాలామంది పురుషులు బాత్రూంలో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. నిజానికి మలబద్ధకం అనే సమస్య మహిళల్లోనే అధికంగా ఉంది. కానీ వారే పని త్వరగా పూర్తిచేసుకుని బయటికి వచ్చేస్తారు. పురుషులు మాత్రం బాత్రూంలోనే అధిక సమయం గడిపేందుకు ఇష్టపడతారు. బ్రిటన్ లో నిర్వహించిన ఒక సర్వే ఈ విషయాన్ని తేల్చి చెబుతోంది. బ్రిటన్లో 18 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నా లక్షన్నర మందిపై ఈ సర్వేను నిర్వహించారు. వీరిలో 1,10,000 మంది మహిళలే, 32 వేల మంది పురుషులు. ఇక 118 మంది ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. 


సర్వేలో పాల్గొన్న వారిలో 21 శాతం మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. వారిలో 13 శాతం మంది పురుషులు కాగా, 23 శాతం మంది స్త్రీలు. అంటే పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే గ్యాస్, మలబద్ధకం సమస్యలు అధికంగా ఉన్నాయి. పొట్టనొప్పి, ఉబ్బరం, అతిసారం వంటివి కూడా పురుషుల కంటే స్త్రీలనే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి.


ఇక బాత్రూంలో ఉండే సమయం విషయానికి వస్తే సర్వే ప్రకారం స్త్రీల కంటే పురుషులే ఎక్కువ సమయం పాటు బాత్రూంలో ఉంటారు. స్త్రీలు సగటున మూడు నిమిషాల 53 సెకండ్ల పాటు బాత్రూంలో ఉంటే, పురుషులు ఐదు నిమిషాల 26 సెకండ్ల పాటు ఉంటున్నట్టు సర్వే చెబుతోంది. ఇలా బాత్రూంలో ఎక్కువ సేపు గడపడం వల్ల హేమరోయిడ్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాత్రూంలో ఎక్కువసేపు ఉండడం మానేయాలని చెబుతున్నారు వైద్యులు. పరగడుపునే బాత్ రూమ్‌కి వెళ్లి మలమూత్ర విసర్జనలు చేయడం ఆరోగ్యకరం అని చెబుతున్నారు వైద్యులు. కానీ చాలామంది ప్రజలు ఆ పని చేయడం లేదని సర్వే చెబుతుంది. దాదాపు 60 శాతం మంది కంటే ఎక్కువ బ్రేక్ ఫాస్ట్ తిన్నాకే బాత్రూంకి వెళ్తున్నట్టు సర్వే చెబుతోంది. నిజానికి ఉదయం లేచిన వెంటనే మలవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరమైన సంకేతాలలో ఒకటి.


టాయిలెట్‌లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల మల మార్గంపై ఉంటే రక్త నాళాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అవి ఉబ్బి పైల్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్నే హెమోరాయిడ్ అంటారు. ఇవి వచ్చిందంటే శస్త్రచికిత్స అవసరం. చాలా మంది ఫోన్ తీసుకుని బాత్రూమ్‌లోకి వెళతారు. అలా ఫోన్ తీసుకుని గంటలు గంటలు కూర్చుండిపోతారు. ఇది మానేయాల్సిన అవసరం ఉంది. 


Also read: నా వివాహంలో ప్రేమ లేదు, అందుకే నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది



Also read: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ




















































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.