డైట్ కోక్‌లో వాడే ఒక పదార్థం క్యాన్సర్‌కు కారణం అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ స్వీట్‌నెర్లలో ఒకటి అస్పర్టమే. దీన్ని ఎప్పటినుంచో కోక్‌లో వినియోగిస్తున్నారు. అమెరికాలో ప్రజాదరణ పొందిన చక్కెర ప్రత్యామ్నాయం అస్పర్థమే. అయితే ఇది శరీరంలో చేరాక క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు అంటున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
అస్పర్టమేలో క్యాలరీలు ఉండవు. కానీ సాధారణ పంచదార కన్నా దాదాపు 200 రెట్లు తీపిగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్ వాడకం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి ఇది మానవులకు క్యాన్సర్ కారకంగా జాబితాలో చేర్చారు. గత ఏడాది ఫ్రాన్స్ లో లక్ష మంది పెద్దలపై ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ స్వీట్‌నెర్లు వినియోగించే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉందని తెలింది. అలాగే ఇటలీలోని చేసిన ఒక అధ్యయనంలో ఎలుకల్లో క్యాన్సర్ రావడానికి అస్పర్టమేతో సంబంధం కలిగి ఉందని తేలింది. దీంతో ఇది మానవుల్లో క్యాన్సర్ గా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.
డైట్ కోక్, ఐస్ క్రీమ్, చూయింగ్ గమ్, డైట్ సోడా, షుగర్ ఫ్రీ సోడా, కాఫీ స్వీట్‌నెర్లు, పుడ్డింగ్, షుగర్ ఫ్రీ డిజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జామ్‌లు వంటి వాటిలో అస్పర్టమే ఉపయోగిస్తారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన ప్రకారం 5000 కంటే ఎక్కువ ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో అస్పర్ధమే వాడకాన్ని నిషేధించే అవకాశం కనిపిస్తోంది.
1981 నుంచి అస్పరమే వాడకాన్ని అనుమతి ఇచ్చాయి ప్రభుత్వాలు. డైట్ కోక్‌లు వంటి అస్పర్టమే ఉన్న పదార్థాలు అధికంగా మార్కెట్లో విడుదలవ్వడం మొదలయ్యాయి. ఇప్పుడు ఎన్నో ఉత్పత్తుల్లో దీన్ని వాడుతున్నారు. దీన్ని క్యాన్సర్ కారకంగా ప్రకటిస్తే దీని వాడకం కంపెనీలు ఆపేయాలి. అప్పుడు స్టెవియా వంటి ఆర్టిఫిషియల్ స్వీట్ నెర్లు వాడాల్సి ఉంటుంది.
శరీరంలో నియంత్రణ లేకుండా ఒకేచోట కణాలు పెరిగి పుండులా మారతాయి. అదే క్యాన్సర్. ఇది ఒక చోట నుంచి మరో చోటకు త్వరగా సోకుతుంది. ప్రపంచంలో క్యాన్సర్ అతి ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్ వచ్చాక పూర్తి జీవితకాలం జీవించడం కష్టం.
Also read: ఆల్కహాల్‌ను గాజు గ్లాస్‌లోనే తాగడం ఆనవాయితీగా వస్తుంది, ఎందుకు?
Also read: నా భర్త నా దగ్గర దాచిన రహస్యాన్ని కనిపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.