స్ట్రాంగ్ ఆల్కహాల్, కాక్ టైల్, విస్కీ వంటివన్నీ కూడా గాజు గ్లాసుల్లోనే సర్వ్ చేస్తారు. సాధారణ గ్లాసుల్లో వాటిని తాగే వారి సంఖ్య చాలా తక్కువ. చివరికి చీప్ లిక్కర్ తాగే వారు కూడా  పారదర్శకమైన డిస్పోజబుల్ గ్లాసులోనే తాగుతూ ఉంటారు. ఇలా ఆల్కహాల్‌ను పారదర్శకమైన గ్లాసుల్లో తాగడం ఆనవాయితీగా ఎందుకు మారింది? అందులోనూ ఎక్కువ మంది గాజు గ్లాసులనే వాడడానికి ఇష్టపడతారెందుకు? ఆల్కహాల్‌ను ఇలా గాజు గ్లాస్‌లోనే ఎందుకు తాగాలి? స్టీలు గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటిని ఎందుకు తాగరు. దీనికి శాస్త్రీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి వల్లే ఆల్కహాల్‌ను గాజు గ్లాసుల్లో తాగుతారు.


గ్లాస్‌తో తయారు చేసిన వస్తువులు చక్కగా ఉంటాయి. అందులో వేసిన ఆహారాలను చూస్తే నోరూరేలా కనిపిస్తాయి. ఇది తటస్థ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే అందులో వేసిన ఆహారాలతో ఎలాంటి రసాయనా సంబంధాలను కలిగి ఉండదు. అలాగే రుచి, పదార్థాల వాసన చెక్కుచెదరకుండా ఉంటాయి. కానీ ఇతర రకాల గ్లాసులు వాటిలో వేసిన ఆహారంతో అవాంచిత రసాయనాల విడుదలకు కారణం అవుతాయి. రుచిని కూడా మార్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా గాజు గ్లాసుని ఆల్కహాల్ తాగడానికి వాడతారు. ఈ గ్లాసు పారదర్శకంగా ఉంటుంది. అందులో వేసిన ఆల్కహాల్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మరింతగా తాగాలన్న కోరికను పెంచుతుంది. ఎందుకంటే ఆహారానికి విజువల్ అప్పీల్ చాలా ముఖ్యం. కాషాయం రంగులో ఉండే విస్కీ అయిన, క్రిస్టల్ క్లియర్‌గా కనిపించే వోడ్కా అయినా గాజు గ్లాసులో తమ రూపాన్ని, రంగును ఏమాత్రం మార్చుకోకుండా అలానే కనిపిస్తాయి. అందుకే ఎక్కువమంది గాజు గ్లాసులోనే ఆల్కహాల్ పానీయాలను తాగేందుకు ఇష్టపడతారు.


అలాగే గాజు గ్లాసులో వేసిన ఆల్కహాల్ ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంటే గది ఉష్ణోగ్రతకు త్వరగా వచ్చేయదు. కాస్త చల్లగా కొంత కాలం పాటు ఉంటుంది. గాజు గ్లాసు గది ఉష్ణోగ్రతలో ఉన్న వేడిని ఆల్కహాల్‌కు బదిలీ చేయకుండా అడ్డుకుంటుంది. అందుకే ఆల్కహాల్ అమ్మకాలు కూడా గాజు సీసాల్లోనే జరుగుతూ ఉంటాయి. గ్లాస్ ఎక్కువ కాలం మన్నుతుంది. ఎక్కువ కాలం పాటు ఉపయోగించినా కూడా దాన్ని త్వరగా శుభ్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే లోపల ఉన్న వ్యర్ధాలు కూడా క్లిస్టర్ క్లియర్‌గా చూపిస్తాయి.


గాజు అనేది నాన్ పోరస్. అంటే బయటి వాసన, రుచి, బ్యాక్టీరియా వంటి వాటిని త్వరగా గ్రహించదు. పానీయాలు కాలుష్యం కాకుండా అడ్డుకుంటుంది. అందులో త్వరగా చేరకుండా రక్షణ కల్పిస్తుంది. దీనివల్లే ఆల్కహాల్ ఎల్లప్పుడు గాజు వస్తువుల్లోనే భద్రపరుస్తారు. తాగేటప్పుడు కూడా గాజు గ్లాసులోనే తాగుతారు.



Also read: నా భర్త నా దగ్గర దాచిన రహస్యాన్ని కనిపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

















































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.