Top Headlines In Ap And Telangana:


1. ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా


ఏపీలో రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కూటమిలోని TDP - 49, JSP - 9, BJP - 1 పోస్టు ఇచ్చారు. 59 మందితో రెండో‌జాబితాలో బిసిలకు టాప్ ప్రయార్టీ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభించింది. గత ఎన్నికలలో సీట్ల‌ను త్యాగం చేసిన వారికీ ప్రాధాన్యత ఇచ్చారు. టిడిపి నుంచి పట్టాభి, ఉండవల్లి శ్రీదేవి జనసేన నుంచి చిల్లపల్లి‌ శ్రీనివాస్,  కొత్తపల్లి సుబ్బారాయుడుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. బిజెపి నుంచి మట్టా ప్రసాద్ కు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ పదవి లభించింది. ఇంకా చదవండి.


2. మోడల్ సీ ప్లేన్‌లో సీఎం చంద్రబాబు ప్రయాణం


దేశంలోనే తొలిసారిగా సీప్లేన్ పర్యాటకం అందుబాటులోకి వచ్చింది. సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్‌’లో ప్రయాణించారు. ప్రకృతిని చూస్తూ జలమార్గం చేసే విహారం రాష్ట్ర పర్యాటక రంగానికి మరో ఆణిముత్యంగా చెప్పవచ్చు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంబోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా చదవండి.


3. కోనసీమలో భయపెడుతోన్న వరుస చోరీలు


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హిందూ ఆలయాలే టార్గెట్‌గా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆలయాల్లో ఉండే బంగారు, వెండి వస్తువులు ఎత్తుకెళుతున్నారు. హుండీలను కూడా వదలడం లేదు. అందులో ఉన్న చిల్లర డబ్బలు పట్టించుకోకుండా కరెన్సీ ఉంటే మాత్రం తస్కరిస్తున్నారు. రెండు నెలల క్రితం అమలాపురం కిమ్స్‌ వెంకటేశ్వరస్వామి గుడిలో, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీగా బంగారం, వెండి స్వాదీనం చేసుకున్నారు. ఇంకా చదవండి.


4. తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు?


తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొన్న జరిగిన డీఎస్సీ 2024లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. దీంతో ఈసారి టెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తాయని తెలుస్తోంది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. నిపుణులు సూచించిన మోడల్ ఆధారంగా పాఠశాల విద్యా శాఖ తెలంగాణ ప్రభుత్వం TG TET నిర్వహిస్తోంది. TG TETలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1, పేపర్ 2. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు TG TET పేపర్ 1 పరీక్ష రాస్తారు. ఇంకా చదవండి.


5. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి దగ్గర పడుతోంది. ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయలేదు. ఇవాళ..రేపు అని వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికి పది సార్లకుపైగా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇక విస్తరించడమే మిగిలి ఉందని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దీపావళి తర్వాత కేబినెట్‌ను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా చదవండి.