TG TET Exam Pattern 2024: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొన్న జరిగిన డీఎస్సీ 2024లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. దీంతో ఈసారి టెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తాయని తెలుస్తోంది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది.
నిపుణులు సూచించిన మోడల్ ఆధారంగా పాఠశాల విద్యా శాఖ తెలంగాణ ప్రభుత్వం TG TET నిర్వహిస్తోంది. TG TETలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1, పేపర్ 2. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు TG TET పేపర్ 1 పరీక్ష రాస్తారు. దీనికి డీఈడీ చేసి చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.
6 తరగతి నుంచి 8 తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 2 కోసం పరీక్ష రాస్తారు. బీఈడీ చేసిన వాళ్లు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. వీళ్లు కాకుండా 1 నుంచి 8 తరగతుల వరకు బోదించే వాళ్లు రెండు పేపర్లు రాస్తారు. TG TET పరీక్షా సరళి చూస్తే పేపర్ 1కి పేపర్ 2కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నాలుగు ఆప్షన్స్ (MCQలు)ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పేపర్ 1, పేపర్ 2 సిలబస్‌ను ఇక్కడ చూడొచ్చు.
TG TET Exam Pattern: పేపర్ వారీగా పరీక్షా సరళిని చూసే ముందు పరీక్ష పేపర్‌లో ఉండే ముఖ్యాంశాలు చూద్దాం.
విషయం | TG TET Paper 1 ముఖ్యాంశాలు | TG TET Paper 2 ముఖ్యాంశాలు |
పరీక్ష విధానం | ఆఫ్‌లైన్ | ఆఫ్‌లైన్ |
పరీక్ష పేపర్‌లో విభాగాలు | 5 | 4 |
చదవాల్సిన సబ్జెక్టులు | పిల్లల అభివృద్ధి అండ్ బోధన(Child Development and Pedagogy) భాష-I (తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ) భాష-II (ఇంగ్లీష్) గణితం పర్యావరణ అధ్యయనాలు(Environmental Studies) |
పిల్లల అభివృద్ధి మరియు బోధన(Child Development and Pedagogy) భాష-I (తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతం) భాష-II (ఇంగ్లీష్) గణితం, సైన్స్ సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ |
పరీక్షకాలం | 150 నిమిషాలు | 150 నిమిషాలు |
మొత్తం ప్రశ్నలు | 150 | 150 |
ప్రశ్నల విధానం | మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ | మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ |
మొత్తం మార్కులు | 150 | 150 |
ఏ భాషలో పరీక్ష ఉంటుంది | ఇంగ్లిష్, భాష-1 మినహా మిగతా పరీక్ష పత్రం అభ్యర్థి ఎంచుకున్న భాషలో ఉంటుంది. | ఇంగ్లిష్, భాష-1 మినహా మిగతా పరీక్ష పత్రం అభ్యర్థి ఎంచుకున్న భాషలో ఉంటుంది. |
గమనిక: ఇక్కడ మీరు ఎంచుకున్న భాషతోపాటు ఇంగ్లిష్‌లో కూడా పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్‌లో పరీక్ష రాయాలనుకునే వాళ్లకు మాత్రమ ఒకటే భాషలో ఉంటుంది.
టెట్‌లో జనరల్ అభ్యర్థులు అర్హత సాధించడానికి కనీసం 60% మార్కులు (అంటే 150 మార్కులకు 90 మార్కులు) స్కోర్ చేయాల్సి ఉంటుంది. OBCవర్గాలకు చెందిన అభ్యర్థులుు 75 మార్కులు సాధిస్తే చాలు అర్హత సాధించినట్టే. SC/ST/PH అభ్యర్థులకు 50 మార్కులు వస్తే వాళ్లు డీఎస్సీ రాసుకునేందుకు అర్హులు అవుతారు.