Youtube New Rule: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ తమ వీడియోలకు తప్పుదారి పట్టించే టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్‌ను ఉపయోగించే కంటెంట్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అబద్ధపు క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్‌తో వీడియోలను అప్‌లోడ్ చేసే భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. వీడియో కంటెంట్‌తో సంబంధం లేని వీడియోల టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇది ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ లేదా కరెంట్ ఈవెంట్‌లకు సంబంధించిన వీడియోల్లో ఉంటుంది.
థంబ్‌నెయిల్ మ్యాచ్ అవ్వాల్సిందే...
సంచలనాత్మకమైన లేదా తప్పుదారి పట్టించే టైటిల్స్, థంబ్‌నెయిల్స్ ప్రేక్షకుల అనుభవాన్ని పాడు చేస్తాయని యూట్యూబ్ పేర్కొంది. ముఖ్యమైన సమాచారం కోసం ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చే ప్రేక్షకులను ఇలాంటి టైటిల్స్ తప్పుదోవ పట్టిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్, కరెంట్ అఫైర్స్‌పై వీడియోలను రూపొందించే ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్ ఈ స్కానర్ కిందకు వస్తారు. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు క్రియేటర్లు తమ వీడియోలో అందించని కంటెంట్‌కు సంబంధించిన టైటిల్స్, థంబ్ నెయిల్స్ పెట్టకూడదు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
యూట్యూబ్ ఎలాంటి చర్య తీసుకుంటుంది?
దీని గురించి సమాచారం ఇస్తూ తప్పుదారి పట్టించే టైటిల్స్, థంబ్‌నెయిల్స్‌తో కూడిన కంటెంట్‌ను మొదట తొలగిస్తామని యూట్యూబ్ తెలిపింది. అయితే మొదటి సందర్భంలోనే క్రియేటర్‌పై స్ట్రైక్ పడదు. కొత్త నియమాన్ని అర్థం చేసుకోవడానికి క్రియేటర్లకు కూడా సమయం ఇచ్చేలా దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది.
అయితే బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్‌లను కవర్ చేసే వీడియోల పరిధిలోకి ఏ రకమైన వీడియోలు వస్తాయో యూట్యూబ్ ఇంకా స్పష్టం చేయలేదు. అలాగే తప్పుడు టైటిల్, థంబ్‌నెయిల్స్ ఉన్న వీడియోలను ఎలా గుర్తిస్తుందనే దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!