BRS has issued a warning to Congress not to enter NTR Ghat: సెక్రటేరియట్ పక్కనే ఉన్న ఎన్ఠీఆర్ ఘాట్ ను తొలగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వీరు మట్లాడారు.  ఎన్ఠీఆర్ ను బతికుండగా వేధించిన కాంగ్రెస్ నేతలు ఆయన చనిపోయాక కూడా వదలడం లేదన్నారు.  ట్యాంక్ బండ్ ను  నాడు అభివృద్ధి చేస్తానంటే ఎన్ఠీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని..  కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నా ఎన్ఠీఆర్ కుర్చి వేసుకుని మరీ ట్యాంక్ బండ్ ను నిర్మించారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. 



Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ




రెండు రోజుల కిందట అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ ఘాట్ పీకి పడేసి అక్కడ సెక్రటేరియట్ నిర్మిస్తే వ్యూ బాగుంటుందని చెప్పుకొచ్చారు. సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ ఉండటం మంచిదన్నారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ ఘాట్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు మండిపడ్డారు. అయితే తాను అలాంటి మాటలు మాట్లాడలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. తాను సెక్రటేరియట్ పక్కన అసెంబ్లీ ఉండాలని మాత్రమే అన్నానంటున్నారు. 



Also Read: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు