Mohan Babu did not get relief in Telangana High Court: పోలీసులు అరెస్టు చేయుకండా ఉండేందుకు మంచు మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం అడిగారు. దీంతో కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ లోపు తన క్లయింట్ ను పోలీసులు అరెస్టు చేస్తారేమోనని అప్పటి వరకూ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరుపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ ప్రకారం మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే అడ్డంకులు లేవని అనుకోవచ్చు.
మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అది పోలీస్ స్టేషన్లు, కేసుల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఈ విషయాలు రిపోర్టు చేయడానికి మీడియా జల్ పల్లిలోని మంచు ఇంటి ముందు పడిగాపులు పడింది. గొడవ జరిగిన రోజున మంచు మనోజ్ ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనతో పాటు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడికి దిగారు. ఓ టీవీ చానల్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్లు చేశారు.
Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ
ఇటీవల మీడియాతో మాట్లాడిన రాచ కొండ సీపీ సుధీర్ .. మోహన్ బాబుకు కోర్టు ఇరవై నాలుగో తేదీ వరకు గడువు ఇచ్చిందన్నారు. ఆయనను అరెస్టు చేయడంలో ఎలాంటి ఆలస్యం లేదన్నారు. అయితే పోలీసు ఎదుట హాజరు కాకుండా మాత్రమే హైకోర్టు చాన్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఇప్పుడు హైకోర్టు అరెస్టు విషయంలో రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఇటీవల మోహన్ బాబు తన దాడిలో గాయపడిన టీవీ జర్నలిస్టును కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు.
Also Read: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు