Youtube Premium: యూట్యూబ్ దేశంలో వినోదం కోసం ఉపయోగించే వేదికగా ఉంది. ప్రజలు సమాచారంతో పాటు వినోదాన్ని పొందడానికి యూట్యూబ్‌లో వీడియోలను చూస్తారు. ఫోన్‌లో ఏమైనా సెట్టింగ్స్ మార్చాలన్నా, ఏదైనా వంట చేయాలన్నా, మనం రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో ఏదైనా సమస్య తలెత్తినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో యూట్యూబ్‌లోనే చూస్తాం.
ఇప్పుడు యూట్యూబ్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. యూట్యూబ్ ఫ్రీ వెర్షన్‌లో యాడ్స్ వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ యాడ్స్ రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం ఉపయోగించవచ్చు. యూట్యూబ్ ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరని పెంచింది. యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు ప్రీమియం వినియోగదారులను అందరినీ ప్రభావితం చేయనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రేట్లు ఎంత పెరిగాయి?
యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధర సంవత్సరానికి సుమారు రూ.200 వరకు పెరిగింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. యూట్యూబ్ ప్రీమియం ఇప్పుడు నెలవారీ, మూడు నెలలు, 12 నెలల ప్లాన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వినియోగదారులు ఈ ప్లాన్‌లన్నింటికీ ఇంతకు ముందు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు దీని ధర ఎంత?
యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల వ్యక్తిగత నెలవారీ ప్లాన్ ధర రూ.129 నుంచి రూ.149కి పెరిగింది. అదే సమయంలో స్టూడెంట్ నెలవారీ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది. ఇక ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధర రూ. 189 నుంచి రూ. 299కి పెరిగింది. వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్ ధర రూ. 139 నుండి రూ. 159కి పెరిగింది. ఇది కాకుండా 3 నెలల ప్లాన్ ధర రూ. 399 నుండి రూ.459కి పెరిగింది. వార్షిక ప్లాన్ ధర కూడా రూ.1290 నుంచి రూ.1490కి పెరిగింది.
యూట్యూబ్‌లో యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లు మాత్రమే ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లను కొనుగోలు చేసిన తర్వాత వీడియోలను చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి యాడ్స్ కనిపించవు. మీరు ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వీడియోను ఎటువంటి అంతరాయం లేకుండా చూడవచ్చు.
మనదేశంలో కూడా చాలా మంది యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరి మీద దీని ప్రభావం కచ్చితంగా పడుతుంది. మరి దీని కారణంగా సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య తగ్గుతుందో లేదో చూడాలి మరి!
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే