Xiaomi Mix Flip Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన మొదటి క్లామ్‌షెల్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే షావోమీ మిక్స్ ఫ్లిప్ (Xiaomi Mix Flip). ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. మొదటగా ఇది చైనాలో లాంచ్ అయింది. రెండు నెలల తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై షావోమీ మిక్స్ ఫ్లిప్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వీటిలో అవుటర్ స్క్రీన్ వైపు అంటే ఫోన్ వెనకాల రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. లెయికా భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో 4.01 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇన్నర్ స్క్రీన్ 6.86 అంగుళాలుగా ఉంది.


షావోమీ మిక్స్ ఫ్లిప్ ధర (Xiaomi Mix Flip Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 1,300 యూరోలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1,21,500) ఉంది. బ్లాక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


షావోమీ మిక్స్ ఫ్లిప్ చైనాలో 6,499 యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.77,600) ధరతో లాంచ్ అయింది. అంటే చైనా ధరకు దాదాపు రెట్టింపు ధరతో గ్లోబల్ వెర్షన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


షావోమీ మిక్స్ ఫ్లిప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Xiaomi Mix Flip Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ స్కిన్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై షావోమీ మిక్స్ ఫ్లిప్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో ఉంది. 16 జీబీ ర్యామ్ ఆప్షన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవ్వలేదు.


ఈ ఫోన్‌లో 6.86 అంగుళాల 1.5కే క్రిస్టల్‌రెస్ అమోఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. బయటవైపు 4.01 అంగుళాల 1.5కే ఆల్ అరౌండ్ లిక్విడ్ అమోఎల్ఈడీ స్క్రీన్‌ప్లే ఉంది. ఇన్నర్, అవుటర్ డిస్‌ప్లేలు రెండూ డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ కంటెంట్‌ను సపోర్ట్ చేయనున్నాయి.


ఇందులో బయటవైపు అంటే, ఫోన్ వెనకాల 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ ఆమ్నీవిజన్ ఓవీ60ఏ40 టెలిఫొటో లెన్స్‌గా ఉంది. ఇది 2x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇన్నర్ స్క్రీన్‌లో 32 మెగాపిక్సెల్ ఆమ్నీవిజన్ ఓవీ32బీ లెన్స్‌ను సెల్ఫీ కెమెరాగా అందించారు.


512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 బిల్ట్ ఇన్ స్టోరేజ్‌ను షావోమీ మిక్స్ ఫ్లిప్‌లో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?