WhatsApp: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఇంటర్‌ఫేస్‌లో పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తర్వాత మీరు వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఇకపై రెండు చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక చేత్తో మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌లో ఏ ఫీచర్లు రానున్నాయో చూద్దాం.


వాట్సాప్ బాటమ్ ట్యాబ్ ఇంటర్‌ఫేస్
ఎంతో టెస్టింగ్ తర్వాత వాట్సాప్ ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ని ఒక చేత్తో ఉపయోగించినా మనకు ఎలాంటి సమస్యా రాదు. ఇప్పటి వరకు వాట్సాప్ రూపొందిస్తున్న ఈ ఇంటర్‌ఫేస్ టెస్టింగ్‌లో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.


వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ ఎలా ఉంది?
వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ కొత్త కలర్‌తో వచ్చింది. అలాగే డిజైన్ కూడా కొత్తగా ఉంది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.20.76లో అందుబాటులో ఉంది. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాట్సాప్‌కు సంబంధించిన ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయవచ్చు. కొత్త అప్‌డేట్‌లో, యాప్ దిగువన చాట్, అప్‌డేట్, కమ్యూనిటీ, కాల్ బటన్‌లు కనిపిస్తాయి.
 
ఈ ట్యాబ్‌లన్నింటితో పాటు కొత్త సింబల్స్ కూడా కనిపిస్తాయి. కొత్త అప్‌డేట్‌తో అతిపెద్ద మార్పు ఏమిటంటే, దీన్ని ఒక చేతితో ఉపయోగిస్తున్నప్పటికీ, వినియోగదారులు వివిధ ట్యాబ్‌ల మధ్య సులభంగా మారవచ్చు. కొత్త అప్‌డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం విడుదల అయింది. త్వరలో ఇది ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి రానుంది.


గత వారం వాట్సాప్ ఛానెల్ ఫీచర్ కోసం స్టేబుల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొత్త అప్‌డేట్ తర్వాత యాప్ ఎగువన కనిపించే ఐకానిక్ గ్రీన్ బార్‌ను వినియోగదారులు చూడలేరు. ఇప్పుడు మొత్తం ఇంటర్ఫేస్ తెలుపు రంగులో కనిపిస్తుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial