WhatsApp History Sharing Feature: మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే, గ్రూప్‌లలో వచ్చే కొత్త మెసేజ్‌లు ప్రారంభంలో మీకు అర్థం అవుతూ ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ఈ గ్రూప్‌లో చేరడానికి ముందు అక్కడ ఏ సంభాషణ జరిగింది? వారు దేని గురించి మాట్లాడుకున్నారు అనే విషయం అర్థం కాకపోవచ్చు.


ఈ సమస్యను తొలగించడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. కొత్తగా రానున్న 'రీసెంట్ హిస్టరీ షేరింగ్' ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు పాత గ్రూప్ చాట్‌లను కొత్త వ్యక్తులకు చూపించాలా వద్దా అని ఎంచుకునే హక్కును ఇస్తుంది.


గ్రూప్ అడ్మిన్ ఈ ఫీచర్‌ని ఆన్ చేస్తే, గ్రూప్‌లో ఉన్న వారందరికీ దాని గురించి సమాచారం వస్తుంది. కొత్త సభ్యుడు చేరిన వెంటనే అతను గత 24 గంటల చాట్‌లను చూడగలుగుతాడు. ఈ అప్‌డేట్ గురించిన సమాచారం వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ద్వారా షేర్ చేయబడింది.


కొత్త సభ్యులు గ్రూప్‌లలో కొనసాగుతున్న సంభాషణల గురించి తెలుసుకుంటారు. వారు కూడా ఇందులో చేరిన తర్వాత తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. కాబట్టి ఇది ప్రయోజనకరమైన అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు.


మరో ఫీచర్‌పై కూడా...
వాట్సాప్ కొంత కాలం క్రితం ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మల్టీ అకౌంట్ లాగిన్ అనే ఫీచర్‌ను అందించింది. దీని సహాయంతో వినియోగదారులు ఒకే ఫోన్‌లో ఎక్కువ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించవచ్చు. వ్యక్తులు తమ వర్క్ చాట్‌లు, వ్యక్తిగత ఖాతాలను ఒకే ఫోన్‌లో ఆపరేట్ చేయగలరు కాబట్టి ఈ ఫీచర్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త ఖాతాను జోడించిన తర్వాత ఛాట్‌ల మధ్య స్విచ్ అయితే సరిపోతుంది. మళ్లీ మళ్లీ లాగిన్ అవ్వక్కర్లేదు.


వాట్సాప్ తన వినియోగదారులకు త్వరలో మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్  వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆటో మేటిక్ గా గ్రూపు తన పేరు తానే క్రియేట్ చేసుకుంటుందని తెలిపారు. ఇటీవల ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌ లో, “మీరు హడావిడిగా ఉన్నప్పుడు , గ్రూపు కు పేరు పెట్టే సమయం లేనప్పుడు మీకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. తనంతట తానే గ్రూపునకు పేరు పెట్టుకుంటుంది.” అని తెలిపారు. సుమారు ఆరుగురు సభ్యులు ఉండే పేరు లేని గ్రూపునకు సభ్యుల ఆధారంగా ఆటోమేటిక్‌గా పేరు ఏర్పడుతుంది. ఉదాహరణకు 'మాట్',  'లుపిన్' అనే పేరుతో ఉన్న గ్రూప్‌లో ఇద్దరు సభ్యులు ఉంటే, వాట్సాప్ ఆటో మేటిక్ గా ఈ గ్రూపునకు 'మాట్ అండ్ లుపిన్'గా పేరు పెడుతుంది. 


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial