WhatsApp Status Feature: వాట్సాప్‌ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచంలో ఈ యాప్‌ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య 200 కోట్ల కంటే ఎక్కువ. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. వాట్సాప్‌లో 24 గంటల తర్వాత కూడా స్టేటస్‌ను చూడవచ్చని తెలుస్తోంది.


ఇప్పటి వరకు వాట్సాప్‌లోని స్టేటస్ 24 గంటల షేరింగ్ తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అయితే WABetaInfo నివేదిక ప్రకారం వినియోగదారులు తమ స్టేటస్‌ను రెండు వారాల పాటు ఉంచడానికి అనుమతించే ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అంతేకాకుండా ఈ ఫీచర్‌లో మీరు మీ పాత స్టేటస్ లైవ్‌గా ఉండేలా సమయాన్ని కూడా సెట్ చేయవచ్చు.


వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌ను బీటా వెర్షన్ 2.23.20.12కి అప్‌డేట్ చేశారు. ఇందులో వాట్సాప్ వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్ చేయడానికి నాలుగు ఆప్షన్‌లను పొందుతారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం... మీరు వాట్సాప్ అప్‌డేటెడ్ వెర్షన్‌లో స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తే 24 గంటలు, మూడు రోజులు, ఒక వారం, రెండు వారాలు పాటు ఉంచేలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్‌ను షేర్ చేయవచ్చు.


WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ దాని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాట్ ఇంటర్‌ఫేస్‌ను రీడిజైన్ చేస్తోంది. దీనిలో యాప్ రంగులు మారతాయి. యాప్ లోగో, బటన్‌లు కూడా అప్‌డేట్ కానున్నాయి. అదనంగా వాట్సాప్ ఐప్యాడ్ వినియోగదారుల కోసం ఐవోఎస్ యాప్‌కు వెళ్లే అవకాశాన్ని కూడా పరీక్షిస్తోంది. ఇది ఇటీవల iPad కోసం బీటా వెర్షన్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించింది.


వాట్సాప్‌లో ఈ మార్పుల తర్వాత ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ చాలా మారుతుందని, దీనిలో మీరు మీ అవసరానికి అనుగుణంగా స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోగలుగుతారు. అలాగే వాట్సాప్ కలర్, ఇంటర్‌ఫేస్‌లో మార్పు కారణంగా ఈ యాప్ మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తుంది.


మరోవైపు వాట్సాప్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యాప్‌లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. 'కాల్స్' ట్యాబ్‌లో కంపెనీ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు కాల్స్ ట్యాబ్‌కు వెళ్లినప్పుడు పైన కాల్ లింక్ ఆప్షన్‌ను చూస్తారు. త్వరలో కంపెనీ దాన్ని 'న్యూ కాల్' ఆప్షన్‌తో భర్తీ చేయబోతోంది. ఇది కాకుండా త్వరలో మీరు 31 మందిని కాల్‌కు యాడ్ చేసే అవకాశం కూడా లభించనుంది. అంటే మీరు కాల్ ప్రారంభించిన వెంటనే ఒకేసారి 31 మందిని కాల్‌కు యాడ్ చేసే ఆప్షన్ లభించనుందన్న మాట. ప్రస్తుతం మీరు మొదటగా 15 మందిని మాత్రమే యాడ్ చేయగలరు. ఇప్పుడు ఈ సంఖ్యను ఒకేసారి 32 మందికి పెంచనున్నారు.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial