ఫ్రెండ్ ని డిన్నర్ కి పిలుస్తాం.. నువ్ పంపిన గూగుల్ మ్యాప్ ప్రకారమే వచ్చారా.. రెడ్ కలర్ వేసిన బిల్డింగ్ ఏదీ కనిపించట్లేదు. అయినా ఫ్రెండ్ కోసం విధిలోకి తొంగి చూస్తాం. అసలు నువ్ ఎక్కడున్నావ్.. నేను బ్లాక్ కలర్ కారులో ఉన్నా.. ఆ కలర్ కారే లేదు ఇక్కడ అని ఫ్రెండ్ చెప్తాడు. నీ పక్కన ఏముంది.. గొయ్యి.. అయితే అందులో దూకేయ్ అని కామెడీగా ఇలాంటి మాటలు మాట్లాడుకునే ఉంటారు కదా. గూగుల్ మ్యాప్ పంపినా.. కొంచెం అటు.. ఇటుగా కచ్చితమైన అడ్రస్ దొరకక ఇబ్బందులు పడే ఉంటారు. కదా. అలాంటి వాటికి ఇక్ నుంచి చెక్ పెట్టేందుకు వచ్చింది ఓ యాప్... అదే What3Words.
ఇది యాప్, వెబ్ సైట్ రూపంలో అందుబాటులో ఉంది. దీని ప్రకారం ఈ భూమిని 3 మీటర్స్ స్క్వేర్ చొప్పున డివైడ్ చేశారు. ప్రతి దానికి మూడు పదాలతో పేరు పెట్టారు. డాగ్ టేబుల్ ఫ్యాన్, గ్రేట్ సూపర్ అమేజింగ్.. ఇలా ప్రతీ 3 మీటర్స్ స్వేర్ కి మూడు పదాలతో ఒక పేరు ఉంటుంది. మీ ఇంటి అడ్రస్ తీసినా.. మీరు ఎక్కడ నిలుచున్నా దానికో పేరు ఉంది. అడ్రస్ పంపితే.. కచ్చితమైన పేరు ఉంటుంది. మీరు నిలుచున్న చోటకే వచ్చేస్తారు.
Also Read: Mi Laptops: ఎంఐ నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు.. ధర, ఫీచర్ల వివరాలు..
ఇంట్లో అమ్మానాన్న ఉన్నారు.. ఇంటి ముందు నుంచి వద్దు... వెనకాలా నుంచి రా.. అని ఫ్రెండ్ కి చెబితే.. వాట్3వర్డ్స్ యాప్ తో ఇంటి వెనకకే వస్తారు. మన ఇల్లు What3Wordsలో ఏ పేరుతో ఉందో చెక్ చేసుకోవాలి అంతే. దానిని వాట్సప్ లో ఫ్రెండ్ కి షేర్ చేయాలి. ఫ్రెండ్ పంపిన మూడు పదాలను.. ఆ యాప్ లో వాయిస్ చెబితే సరిపోతుంది. డైరెక్షన్స్ నేరుగా తీసుకెళ్తుంది. విదేశాల్లో ఇప్పటికే దీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ 26 భాషాల్లో అందుబాటులో ఉంది. త్వరలో తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లోకి రానుంది.
Also Read: Vishing Fraud: మోసగాళ్ల సరికొత్త టెక్నిక్ ‘విషింగ్’... ఈ విషయాలు తెలుసుకుంటే మీరు చాలా సేఫ్..!
అయితే ఇది గూగుల్ మ్యాప్స్ ను బెస్ చేసుకోని పనిచేస్తుంది. ఉదాహరణకు ఓ పెద్ద బిల్డింగ్ కు నాలుగు గేట్లు ఉన్నాయి. అక్కడకు వచ్చేందుకు ఫ్రెండ్ గూగుల్ మ్యాప్స్ అడ్రస్ షేర్ చేస్తే.. కచ్చితంగా ఏ గేట్ దగ్గరకు రావాలని అనేది కష్టమే. కానీ What3Words యాప్ లో కచ్చితంగా ఏ ప్రదేశానికి రావాలనేది తెలిసేందుకు క్లిక్ చేయగానే.. మూడు పదాలు కనిపిస్తాయి. వాటిని షేర్ చేస్తే సరిపోతుంది అన్నమాట.
Also Read: Galaxy A52s 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ వచ్చేస్తుంది.. ఇంకొన్ని రోజుల్లోనే లాంచ్!