ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి రెండు సరికొత్త ల్యాప్‌టాప్స్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో భాగంగా వీటిని విడుదల చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఆల్ట్రా, ఎంఐ నోట్‌బుక్ ప్రో పేర్లతో ఇవి రెండు ఎంట్రీ ఇచ్చాయి. ఇవి చూడటానికి సన్నగా, తక్కువ బరువుతో ఉన్నాయి. వీటికి బ్యాక్‌లిట్ కీబోర్డు ఉంటుంది.


వీటిలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను అందించారు. ఈ రెండింటిలో 16:10 యాస్పెక్ట్ రేషియో ఉన్న డిస్‌ప్లే ఉంటుంది. వీటి సేల్ ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంఐ డాట్ కాం, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఆపర్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కొనుగోలు చేస్తే ఐ7 వేరియంట్లపై రూ.4,500, ఐ5 వేరియంట్లపై రూ.3,500 డిస్కౌంట్ లభించనుంది.


ఎంఐ నోట్‌బుక్ ఆల్ట్రా, నోట్‌బుక్ ప్రో ధర..
ఎంఐ నోట్‌బుక్ ఆల్ట్రాలో ఐ5 (8జీబీ, 16జీబీ), ఐ7 (16జీబీ) అనే రెండు వేరియంట్లు అందించారు. ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.59,999గా.. ఐ5 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.63,999గా నిర్ణయించారు. ఇక ఐ7 ప్రాసెసర్, 16జీబీ వేరియంట్ ధర రూ.76,999గా ఉంది. 


ఎంఐ నోట్‌బుక్ ప్రో విషయానికి వస్తే.. ఇందులో కూడా ఐ5, ఐ7 వేరియంట్లు ఉన్నాయి. ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.56,999గా.. ఐ5 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.58,999గా నిర్ణయించారు. ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. 


ఎంఐ నోట్‌బుక్ ఆల్ట్రా స్పెసిఫికేషన్లు.. 





  • 15.6 అంగుళాల ఎంఐ ట్రూలైఫ్ ప్లస్ డిస్‌ప్లే

  • యాస్పెక్ట్ రేషియో 16:10 

  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90HZ

  • ఫుల్‌సైజ్ బ్యాక్ లైట్ కీబోర్డు 

  • 70Whr బ్యాటరీ, 12 గంటల బ్యాకప్‌ 

  • 65W యూఎస్‌బీ టైప్-సీ పవర్ అడాప్టర్‌ను కూడా అందించారు. 


ఎంఐ నోట్‌బుక్ ప్రో స్పెసిఫికేషన్లు..




  • 14 అంగుళాల 2.5కే డిస్‌ప్లే

  • యాస్పెక్ట్ రేషియో 16:10

  • 300 నిట్స్ బ్రైట్‌నెస్

  • 11వ జనరేషన్ ఐ7 ప్రాసెసర్ 

  • 56Whr బ్యాటరీ, 11 గంటల బ్యాటరీ లైఫ్