శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారతదేశంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గత వారంలో యూకేలో లాంచ్ అయిన ఈ ఫోన్‌.. ఇండియాలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మనదేశంలో సెప్టెంబర్ 3వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ లాంచ్ కానున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఇది రానుంది. యూకేలో 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే విడుదలవ్వగా.. మన దేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ కానుందని తెలుస్తోంది. 


శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర (అంచనా)
పలువురు టిప్‌స్టర్లు పేర్కొన్న వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ రెండు వేరియంట్లతో రానుంది. ప్రారంభ వేరియంట్ అయిన 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.35,999గా ఉండనుంది. హైఎండ్ వేరియంట్ అయిన 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.37,999గా ఉండే అవకాశం ఉంది. యూకేలో విడుదలైన మోడల్ లో బ్లాక్, వైట్, వైలెట్, మింట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. యూకేలో ఈ ఫోన్ ధర 409 పౌండ్లుగా (సుమారు రూ.41,800) నిర్ణయించారు. 


శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) 
యూకేలో విడుదలైన మోడల్ స్పెసిఫికేషన్లే శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ లోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం చూసుకుంటే గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ3తో పనిచేయనుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ ఓ డిస్‌ప్లే అందించారు. రిఫ్రెష్ రేట్ 120Hzగా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ కూడా అందించారు. 


వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందించారు. వీటిలో ప్రెమరీ కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ ఉన్నాయి. ముందు వైపు 32 మెగా ఫిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఏ- జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ వంటివి ఉన్నాయి. ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 


Also Read: Vishing Fraud: మోసగాళ్ల సరికొత్త టెక్నిక్ ‘విషింగ్’... ఈ విషయాలు తెలుసుకుంటే మీరు చాలా సేఫ్..!


Also Read: Jio Phone Next: జియో ఫోన్ వచ్చేస్తుంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్!