తాను ఎంతో ఇష్టంగా భావించే పోలీసు ఉద్యోగం సాధించింది. ట్రైనీ ఎస్ఐగా పనిచేసింది. ఇంతలో ఏ కష్టమొచ్చిందో కానీ ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం పోలీసు ట్రైనింగ్ హాస్టల్‌లో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారమే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమె.. సొంత జిల్లాకు వెళ్లాల్సిఉంది. కానీ ఇంతలో హాస్టల్ లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: Dalitha Bandhu: దళిత బంధు విషయంలో అదే జరిగితే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి
బాధ్యతలు చేపట్టే ముందు
భవానీ స్వగ్రామం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంగా తెలుస్తోంది. ఇటీవల ఆమెకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టే వారం ముందుగా విజయనగరం ట్రైనింగ్ స్టేషన్ లో శిక్షణ తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టే తరుణంలో ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు ట్రైనింగ్ హాస్టల్ లోని సహచరులను విచారిస్తున్నారు.
Also Read: Neelakurinji Flowers: భూతల స్వర్గం.. 12 ఏళ్ల తర్వాత వికసించిన నీలకురింజి పుష్పాలు
చివరిగా సోదరుడికి ఫోన్
ఎస్సై భవానీ విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారిగా ఫోన్ చేసి ట్రైనింగ్ పూర్తయినట్లు చెప్పిందని విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ అన్నారు. విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉద్యోగ సమస్యలా?
2018 బ్యాచ్‌కు చెందిన భవానీ ట్రైనింగ్ లో భాగంగా వారం రోజుల క్రితం విజయనగరం పీటీసీకి వచ్చారు. రాజోలులో శిక్షణ పొందిన ఆమె సఖినేటిపల్లిలో పని చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆత్మహత్యకు ఉద్యోగంలో సమస్యలా, లేక కుటుంబ సమస్యలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.